Deepak Saroj Announced New Movie after Siddharth Roy Movie
Deepak Saroj : చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన దీపక్ సరోజ్ ఇటీవల సిద్దార్థ్ రాయ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఓ డిఫరెంట్ రొమాంటిక్ లవ్ స్టోరీ కథాంశంతో ఈ సినిమా థియేటర్స్ లో పర్లేదనిపించింది. తాజాగా దీపక్ సరోజ్ మరో కొత్త సినిమా మొదలుపెట్టాడు. దీపక్ సరోజ్ హీరోగా దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నేడు కొత్త సినిమా ప్రారంభమైంది.
శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై తన్నీరు హరిబాబు నిర్మాణంలో హరీష్ గదగాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈసారి కూడా రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ కథాంశంతోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యాదమ్మ రాజు, రచ్చ రవి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ కి సపోర్ట్ చేయడానికి దర్శకులు వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, యదు వంశీ , సుజిత్, సందీప్.. పలువురు గెస్టులుగా వచ్చారు. ఈ సినిమా ఓపెనింగ్ లో సినిమా స్క్రిప్ట్ ని ప్రదీప్ మద్దాల, యదువంశీ అందించగా వేణు ఉడుగుల క్లాప్ కొట్టారు. సుజిత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఫస్ట్ షాట్ కి సందీప్ డైరెక్షన్ చేశారు.
అనంతరం ఈ సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. కథ చెప్పగానే నిర్మాత వెంటనే మొదలుపెడదాం అన్నందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇది కంప్లీట్ లవ్ జానర్ సినిమా. రొమాంటిక్ కాల్ టు లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. జనవరిలో షూట్ మొదలుపెట్టి ఏప్రిల్ లో ముగిస్తాము అని తెలిపారు. హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ.. సిద్ధార్థ రాయ్ సినిమాకి మంచి రిసెప్షన్ ఇచ్చారు. ఒక మంచి ప్రేమ కథతో వస్తున్నాం. సిద్దార్థ్ రాయ్ తర్వాత నేను మంచి కథల కోసం చూస్తున్నప్పుడు ఈ కథ విన్నాను. ఇది విన్నాక నేను కచ్చితంగా చెప్పాల్సిన కథ అనిపించి ఓకే చేశాను అని తనకు ఛాన్స్ ఇచ్చిన నిర్మాతకు, మూవీ యూనిట్ కు ధన్యవాదాలు తెలిపారు.
హీరోయిన్ అనైరా మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో ఛాన్స్ వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఒక బయట వ్యక్తికి సినిమా అవకాశం రావడం మామూలు విషయం కాదు. నాలో ఉన్న టాలెంట్ గుర్తించి నాకు అవకాశం ఇచ్చారు. కెమెరా ముందు కనపడాలి అని నా చిరకాల కోరిక. చిన్నప్పటినుంచి నాకు కెమెరా, సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్న అని తెలిపింది. నిర్మాత హరిబాబు మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. సినిమా మీద ప్యాషన్ తో లక్ష్మీనరసింహ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది అని తెలిపారు.