Project – K : ప్రాజెక్ట్-K నుంచి దీపికా లుక్ రిలీజ్..
ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా 'ప్రాజెక్ట్-K'. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకోణె నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు దీపికా పుట్టినరోజు కావడంతో ప్రాజెక్ట్-K టీం ఆమెకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది. ఇంతకముందు ప్రభాస్, అమితాబ్ బర్త్ డేలకు ఇచ్చినట్లు కాకుండా ఈసారి ఫుల్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.

Deepika Padukone look released from project k
Project – K : ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-K’. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ ఫిలింగా రాబోతుంది. వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వని దత్త్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఎంటువంటి మ్యాటర్ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకోణె నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు దీపికా పుట్టినరోజు కావడంతో ప్రాజెక్ట్-K టీం ఆమెకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది. ఇంతకముందు ప్రభాస్, అమితాబ్ బర్త్ డేలకు ఇచ్చినట్లు కాకుండా ఈసారి ఫుల్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. కానీ పేస్ మాత్రం కనబడకుండా డిజైన్ చేశారు పోస్టర్. అలాగే పోస్టర్ మీద ‘చీకటిలో ఆమె ఒక ఆశ’ అంటూ రాసుకొచ్చారు.
కాగా ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ ప్రతి వస్తువు తయారు చేయాల్సి వస్తుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యాన్స్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఒక వెహికల్ కోసం భారీ చక్రాన్ని తయారు చేస్తున్న వీడియోని ఇటీవల రిలీజ్ చేశారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దిశా పటాని కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Here’s wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023