Amaran : అమరన్ సక్సెస్.. మూవీ టీమ్ ను అభినందించిన డిఫెన్స్ మినిస్టర్..

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా అమరన్.

Amaran : అమరన్ సక్సెస్.. మూవీ టీమ్ ను అభినందించిన డిఫెన్స్ మినిస్టర్..

Defense Minister congratulated the movie team on the success of Amaran

Updated On : November 29, 2024 / 7:58 PM IST

Amaran : శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బెస్ట్ గా నిలిచింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా మొదటి ఆట నుండే అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా చూసి ఏడవని ఆడియాన్ లేరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read : Manchu Vishnu : తన హెయిర్ స్టైలిస్ట్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిన మంచు విష్ణు.. అతనికి ఎంత సపోర్ట్ చేశాడో తెలుసా..

అయితే తాజాగా ఈ సినిమా చూసి..ఏకంగా డిఫెన్స్ మినిస్టర్ అమరన్ మూవీ టీమ్ ను అభినందించారు. “అమరన్” నిర్మాతలు, నటుడు శివ కార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్, నిర్మాత ఆర్ మహేంద్రన్‌లను న్యూ ఢిల్లీలోని తన నివాసంలో కలిశారు. అమరన్ ఇంతటి సక్సెస్ సాధించడంతో మూవీ టీమ్ పై ప్రశంశల వర్షం కురిపించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ అలాగే భారత సైన్యం యొక్క దేశభక్తి, వీరత్వాన్ని చూపించడం పై ప్రశంశించారు.

అలాగే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న శ్రీ కమల్ హాసన్, చిత్ర నిర్మాణ సమయంలో రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం యొక్క నిరంతర మద్దతు, సహకారం కోసం గౌరవ మంత్రికి అభినందలు తెలిపారు. మూవీ టీమ్ తో పాటు డివో మూవీస్ వ్యవస్థాపకుడు, దర్శకుడు విశ్వనాథ్ రామస్వామి, కల్నల్ (రిటైర్డ్) వినోద్ శరవణన్ కూడా ఇందులో పాల్గొన్నారు.