Demon Slayer TRAILER
Demon Slayer : జపనీస్ యానియేట్ సిరీస్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్. ఈ సిరీస్ ఫస్ట్ పార్టు సెప్టెంబర్ 12న భారత దేశంలో విడుదల కానుంది. కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. ఈ సినిమా జపనీస్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది.
చిత్ర (Demon Slayer) విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా తమిళ, తెలుగు ట్రైలర్లను విడుల చేసింది.
Rahul Sipligunj : సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ఫొటోలు వైరల్..
ఈ చిత్ర కథ ఏంటంటే..?
ఓ రాక్షసుడు.. టాంజిరో కామాడో అనే చిన్నారి ఫ్యామిలీని చంపేస్తాడు. అతడి చెల్లలు నెజుకో ఓ రాక్షసిగా మారుతుంది. ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయాలని కామాడో భావిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు టాంజిరో డీమన్ స్లేయర్ కార్ప్స్లో చేరతాడు. మొత్తం మూడు పార్టులుగా ఈ చిత్రం రానుంది. ఈ మూవీని జపాన్‌తో పాటు కొన్ని ఆసియా దేశాల్లో తప్ప, ప్రపంచవ్యాప్తంగా క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనున్నాయి.