వేలాదిగా దూసుకొచ్చిన ఫ్యాన్స్.. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి నోవాటెల్ హోటల్ అద్దాలను ధ్వంసం చేశారు.

వేలాదిగా దూసుకొచ్చిన ఫ్యాన్స్.. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

NTR Deavara

Updated On : September 22, 2024 / 9:17 PM IST

Devara: జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలిరావడంతో భద్రతా పరమైన కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

పరిమితికి మించి వేలాది మంది అభిమానులు రావడంతో అక్కడి ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల సూచనలను ఫ్యాన్స్ వినలేదు. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి నోవాటెల్ హోటల్ అద్దాలను ధ్వంసం చేశారు. కాసేపట్లో ఫాన్స్‌ను ఉద్దేశించి ఎన్టీఆర్ పత్రికా ప్రకటన చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు.

కాగా, దర్శకుడు కొరటాల శివ రూపొందించిన ఈ పాన్‌ ఇండియా మూవీ ఈ నెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్‌ నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో కనపడతారు.

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో అప్పట్లో వచ్చిన జనతా గ్యారేజ్‌ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో దేవర సినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. ఈ సినిమా పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించారు.

Pawan Kalyan – OG : పవన్ OG సినిమా కోసం ఆ హీరోని తీసుకొచ్చిన సుజీత్.. పవన్ ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చిన తమన్..