Saif Ali Khan : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్.. ఎన్టీఆర్ అభిమానులు హ్యాపీ ట్వీట్స్..

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్‌కి.. త్వరగా కోలుకోవాలి, గెట్ వెల్ సూన్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు.

Saif Ali Khan : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్.. ఎన్టీఆర్ అభిమానులు హ్యాపీ ట్వీట్స్..

Devara Star Saif Ali Khan discharged from hospital after minor surgery

Updated On : January 23, 2024 / 5:46 PM IST

Saif Ali Khan : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్.. నిన్న జనవరి 22న ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో సర్జరీ కోసం అడ్మిట్ అయ్యినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక చికిత్స పూర్తీ అవ్వడంతో నేడు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ జాయిన్ అయ్యారని తెలుసుకున్న అభిమానులు.. తమ అభిమాన నటుడికి ఏమైందని తెగ టెన్షన్ పడ్డారు.

అసలు ఏమైందంటే.. సైఫ్ అలీఖాన్ మోకాలికి మరియు భుజాలకి గాయం జరిగినట్లు సమాచారం. నొప్పి ఎక్కువగా ఉండడంతో డాక్టర్స్ ని సంప్రదించిన సైఫ్‌కి.. ఒక చిన్న సర్జరీ చేయాల్సి ఉందని చెప్పారు. దీంతో నిన్న సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వగా.. డాక్టర్స్ ఆ మైనర్ సర్జరీని పూర్తి చేసి నేడు డిశ్చార్జ్ చేశారు. చికిత్స అనంతరం సైఫ్ అలీఖాన్ చేతి కట్టుతో హాస్పిటల్ నుంచి వచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Naresh : ‘మా’ ఎలక్షన్ విషయంలో.. చిరంజీవి గారిని బాధ పెట్టినందుకు.. నేను బాధ పడుతున్నా..

ఇక సైఫ్ అలీఖాన్ కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలి, గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు మేకర్స్ ఆల్రెడీ అందరికి తెలియజేశారు.

దీంతో దేవర సెట్స్ లోనే సైఫ్ అలీఖాన్ గాయపడి ఉంటారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సైఫ్ టీం నుంచి గాయాలు విషయం పై ఎటువంటి సమాచారం లేదు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.