Naresh : ‘మా’ ఎలక్షన్ విషయంలో.. చిరంజీవి గారిని బాధ పెట్టినందుకు.. నేను బాధ పడుతున్నా..
'మా' ఎలక్షన్ విషయంలో చిరంజీవి గారిని బాధ పెట్టినందుకు.. తాను చాలా ఫీల్ అయ్యినట్లు నరేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Naresh said he feel regrets about fight with chiranjeevi in maa elections
Naresh : టాలీవుడ్ సీనియర్ నటుడు గత దశాబ్దాల కాలంగా.. దాదాపు మూడు జనరేషన్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన నరేష్.. ప్రస్తుతం సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా సినిమా పరిశ్రమలో జరిగే ‘మా’ ఎన్నికల విషయంలో లాస్ట్ టైం పెద్ద రచ్చే జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఒక పక్క ప్రకాష్ రాజుకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ గా నిలిస్తే.. మరో పక్క మంచు వారసుడు విష్ణుకి నరేష్ అండగా నిలబడ్డారు.
దీంతో లాస్ట్ టైం మా ఎలక్షన్స్‌లో.. నరేష్ వెర్సస్ మెగా ఫ్యామిలీ అన్నట్లు కనిపించింది. అయితే నరేష్ కుమారుడు నవీన్, సాయి ధరమ్ తేజ్ ప్రాణ స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అలాంటిది మెగా ఫ్యామిలీ పై పోరాటం చేయడం గురించి నరేష్ తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఎలక్షన్స్.. ఎలక్షన్స్ వరుకే అని, ఆ తరువాత కూడా చిరంజీవితో కలిసి మాట్లాడుకున్నామని, నవీన్ అండ్ సాయి ధరమ్ కూడా ఇప్పటికీ అదే స్నేహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.
Also read : Pooja Kannan : సాయి పల్లవి చెల్లెలు.. పూజ కన్నన్ నిశ్చితార్థం ఫోటోలు వచ్చేశాయి..
నరేష్ ఆ విషయం గురించి మాట్లాడుతూ.. “ఏదో ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ వచ్చి.. అది కాస్త పెద్ద గొడవగా ప్రోజెక్ట్ అయ్యింది. అలాంటి గొడవలు ఫ్యామిలీస్ మధ్య, ఫ్రెండ్స్ మధ్య కూడా జరుగుతుంటాయి. ఆ తరువాత మళ్ళీ కలిసిపోతుంటారు. అయితే ఎలక్షన్స్ అలా జరగడం పట్ల మాత్రం నేను చాలా బాధ పడ్డాను. దానికి చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీ ఎంత బాధ పడ్డారో తెలియదు గాని, నేను మాత్రం చిరంజీవి గారిని బాధ పెట్టినందుకు చాలా ఫీల్ అయ్యాను” అంటూ పేర్కొన్నారు.
ఇక మా అధ్యక్షుడిగా మంచు విష్ణు చేసిన పనులు గురించి మాట్లాడుతూ.. “AIG హాస్పిటల్ నుంచి ఎన్నో మెడిసిన్స్ అండ్ ఫెసిలిటీస్ ని విష్ణు కల్పించాడు. అలాగే తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ ఫిలిం ఇండస్ట్రీస్ తో పాటు ఇండియాలోని చాలా పరిశ్రమలని మంచు విష్ణు ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకు వచ్చాడు” అంటూ తెలియజేశారు.