Pooja Kannan : సాయి పల్లవి చెల్లెలు.. పూజ కన్నన్ నిశ్చితార్థం ఫోటోలు వచ్చేశాయి..
సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ నిశ్చితార్థం పూర్తి అయ్యింది. ఫోటో చూసారా..?

Sai Pallavi younger sister Pooja Kannan engagement photos
Pooja Kannan : సాయి పల్లవి సిస్టర్ ‘పూజ కన్నన్’ రీసెంట్ గా తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్టు వేసిన సంగతి తెలిసిందే. ‘వినీత్’ అనే కుర్రాడిని తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ పోస్టుతో అందరికి తెలియజేశారు. అలా ప్రియుడిని పరిచయం చేసి వారం అయ్యిందో లేదో.. అప్పుడే నిశ్చితార్థం దండాలు మార్చుకొని పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిలా కనిపిస్తున్నారు.
అయితే నిశ్చితార్థం అయ్యి ఆల్రెడీ రెండు రోజులు అయ్యింది. జనవరి 21న ఆదివారం నాడు ఈ ఎంగేజ్మెంట్ జరిగినట్లు పూజ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అలాగే నిశ్చితార్థం ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆ పిక్స్ లో సాయి పల్లవి ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆ పిక్స్ ని మీరుకూడా చూసేయండి.
Also read : Tollywood : టాలీవుడ్‌లో 100 కోట్ల షేర్ అందుకున్న హీరోల వీరే.. ఆ ఏడుగురిలో తేజ సజ్జ..
View this post on Instagram
కాగా పూజా తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చారు.. “ఇతని పేరు వినీత్. నా సూర్యోదయానికి ఇతను కిరణం లాంటివాడు. స్వార్థం లేకుండా ప్రేమించడం ఎలానో, ప్రేమలో ఓర్పుతో, నిలకడతో ఉండడం ఎలానో వినీతే నేర్పించాడు” అంటూ పేర్కొన్నారు. ఇక సాయి పల్లవి తనకంటే ముందే తన చెల్లికి పెళ్లి చేస్తూ.. తాను మాత్రం వరుస సినిమాలకు సైన్ చేస్తూ ప్రొఫిషనల్ లైఫ్ లో బిజీ అవుతున్నారు.