Tollywood : టాలీవుడ్‌లో 100 కోట్ల షేర్ అందుకున్న హీరోల వీరే.. ఆ ఏడుగురిలో తేజ సజ్జ..

టాలీవుడ్‌లో 100 కోట్ల షేర్ అందుకున్న హీరోల వీరే. ఆ ఏడుగురు స్టార్ హీరోల మధ్య యువ హీరో తేజ సజ్జ సంచలనం.

Tollywood : టాలీవుడ్‌లో 100 కోట్ల షేర్ అందుకున్న హీరోల వీరే.. ఆ ఏడుగురిలో తేజ సజ్జ..

Tollywood heroes who are got 100 crores share at box office list

Tollywood : టాలీవుడ్ మూవీస్ బడ్జెట్‌లు పెరగడమే కాదు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రేంజ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు 100 కోట్ల గ్రాస్ ని అందుకోవడం పెద్ద చిత్రాలకే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు చిన్న సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడం మొదలుపెట్టాయి. అక్కడితోనే ఆగిపోలేదు, ప్రస్తుతం పెద్ద సినిమాలతో సమానంగా చిన్న సినిమాలు కూడా 100 కోట్ల షేర్ ని కూడా నమోదు చేస్తున్నాయి. అలా టాలీవుడ్ లో 100 కోట్ల షేర్ ని అందుకున్న హీరోలు ఎవరో చూసేయండి.

బాహుబలి సినిమాతో మొదలైంది ఈ వంద కోట్ల షేర్ పరంపర. బాహుబలి 1తో 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని 300 కోట్ల షేర్ ని నమోదు చేశారు. ఆ తరువాత రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాతో 216 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి.. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండో 100 కోట్ల షేర్ హీరోగా నిలిచారు. నెక్స్ట్ మహేష్ బాబు ‘భారత్ అనే నేను’ చిత్రంతో 225 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకొని 100 కోట్ల షేర్ క్లబ్ లోకి వచ్చారు.

Also read : Pushpa 2 : వామ్మో ‘పుష్ప 2’ సినిమా ఇంకా అన్ని రోజులు షూటింగ్ మిగిలిందా? చెప్పిన టైంకి వస్తుందా?

ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఆ సినిమాతో మొదలైన మహేష్ 100 కోట్ల షేర్ పరంపర.. రీసెంట్ మూవీ గుంటూరు కారం వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు మొత్తం ఐదు సినిమాలతో మహేష్ వంద కోట్ల షేర్ ని అందుకున్నారు. వీళ్ళ తరువాత అల్లు అర్జున్ ‘అలవైకుంఠపురములో’ సినిమాతో 260 కోట్ల గ్రాస్‌తో దాదాపు 130 కోట్ల షేర్ ని నమోదు చేసి వంద కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టారు.

ఇక 2022లో ‘ఆర్ఆర్‌ఆర్’ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్.. 100 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇది రామ్ చరణ్‌కి రెండో వంద కోట్ల షేర్ సినిమా. ఇక గత ఏడాదిలో మెగాస్టార్ చిరంజీవి.. ‘వాల్తేరు వీరయ్య’తో 225 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని 100 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టిన మొదటి సీనియర్ హీరోగా నిలిచారు. చివరిగా ఈ క్లబ్ లోకి రీసెంట్ గా అడుగుపెట్టిన హీరో ‘తేజ సజ్జ’.

‘హనుమాన్’ సినిమా ఇప్పటివరకు రూ.207 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఇక ఈ చిత్రంతో వంద కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగుపెట్టిన మొదటి యువ హీరోగా తేజ సజ్జ నిలిచారు. మరి భవిషత్తులు ఈ క్లబ్ లోకి ఎవరెవరు వస్తారో చూడాలి.