Pushpa 2 : వామ్మో ‘పుష్ప 2’ సినిమా ఇంకా అన్ని రోజులు షూటింగ్ మిగిలిందా? చెప్పిన టైంకి వస్తుందా?

ఇప్పటికే పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి మరిన్ని అంచనాలు పెంచాడు డైరెక్టర్ సుకుమార్(Sukumar). ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతుంది.

Pushpa 2 : వామ్మో ‘పుష్ప 2’ సినిమా ఇంకా అన్ని రోజులు షూటింగ్ మిగిలిందా? చెప్పిన టైంకి వస్తుందా?

Allu Arjun Rashmika Pushpa 2 Movie Shooting Balance Details

Updated On : January 23, 2024 / 11:20 AM IST

Pushpa 2 : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. తగ్గేదేలే అంటూ ఎక్కడా తగ్గకుండా తన హవాని ఇండియా అంతా చూపించాడు. పుష్ప పాటల్ని ప్రపంచమంతా మోగించాడు. ఎన్నో ఏళ్లుగా తెలుగు పరిశ్రమకు కలగా మిగిలిన నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుని కూడా తీసుకొచ్చాడు బన్నీ. దీంతో పుష్ప 2 సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి మరిన్ని అంచనాలు పెంచాడు డైరెక్టర్ సుకుమార్(Sukumar). ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతుంది. చాలా శాతం షూటింగ్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ చేస్తామని అధికారికంగా కూడా ప్రకటించారు చిత్రయూనిట్. ఇటీవల బన్నీ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా పుష్ప 2 షూటింగ్ నుంచే వస్తున్నా అని చెప్పాడు.

రష్మిక(Rashmika Mandanna) ఓ ఇంటర్వ్యూలో.. పుష్ప 2 మొదటి పార్ట్ కంటే గ్రాండ్ గా ఉంటుంది. డ్రామా సీన్స్ కూడా చాలా ఉంటాయి. ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తుంది ఈ సినిమా అని చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్ లో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా కోసం రష్మికని ఎక్స్‌ట్రా 50 రోజులు షూటింగ్ డేట్స్ అడిగారట. అంటే సినిమా కంటిన్యూగా షూట్ చేసినా కనీసం రెండు నెలలు షూట్ ఉంది. రష్మిక కాల్ షీట్స్ 50 రోజులు అడిగారంటే పుష్ప 2లో రష్మికకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తుంది.

Also Read : Dhruva Sarja : రామ మందిరం కోసం ఎదురు చూసి.. పిల్లలకు పేర్లు పెట్టిన స్టార్ హీరో..

ఇది కాకుండా ఇంకా వేరే సీన్స్ కూడా షూట్ మిగిలింది. ఇవన్నీ షూట్ కంప్లీట్ చేయడానికి నాలుగు నుంచి అయిదు నెలలు పట్టినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసి ఆగస్టు 15న చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తారా అనేది సందేహమే. కానీ అభిమానులు అంతా సుకుమార్ నే నమ్ముకున్నారు. పుష్ప 2 గ్రాండ్ గా చెప్పిన టైంకి రిలీజ్ చేసి ఆడియన్స్ ని, అభిమానులని సుక్కు మెప్పిస్తాడని భావిస్తున్నారు.