Devara – Pawan Kalyan : అడిగిన వెంటనే ఎన్టీఆర్ ‘దేవర’ టికెట్ రేట్ల పెంపు, ఎక్స్‌ట్రా షోలు.. డిప్యూటీ సీఎంకి థ్యాంక్స్ చెప్పిన నిర్మాత..

దేవరకు కూడా టికెట్ రేట్ల పెంపు తో పాటు బెనిఫిట్, అర్ధరాత్రి షో లకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

Devara Tiket Hikes and Special Shows Permission Granted in AP Producer Naga Vmai Special Thanks to Pawan Kalayn

Devara – Pawan Kalyan : ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర సినిమాకు బెనిఫిట్ షోలు ఉంటాయా? టికెట్ రేట్లు పెరుగుతాయా అని చర్చ జరుగుతుండగా వాటిపై క్లారిటీ ఇచ్చేసారు. గతంలో ఏపీలో బెనిఫిట్ షోలు, అర్ధరాత్రి షోలకు పర్మిషన్ తీసేసిన సంగతి తెల్సిందే.

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక సినిమా పరిశ్రమకు సపోర్ట్ గానే ఉంటున్నారు. ఇటీవల కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచి, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు దేవరకు కూడా టికెట్ రేట్ల పెంపు తో పాటు బెనిఫిట్, అర్ధరాత్రి షో లకు పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా సినిమాని రిలీజ్ చేస్తున్న సితార ఎంటెర్టైమెంట్స్ నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ కి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు.

Also Read : Balakrishna – Venkatesh : సినిమా షూటింగ్‌లో.. వెంకీ మామతో బాలయ్యబాబు ముచ్చట్లు.. ఎక్కడో తెలుసా..?

నిర్మాత నాగవంశీ తన ట్వీట్ లో.. ఏపీ ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కందుల దుర్గేశ్ గారికి కృతజ్ఞతలు. అడిగిన వెంటనే దేవర టికెట్ రేట్ల పెంపుకు, ఎక్స్‌ట్రా షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ సపోర్ట్ సినిమాని మరిన్ని థియేటర్స్, షోలతో ఆడియన్స్ కి చేరవేస్తుంది అని తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు నిర్మాత నాగవంశీ.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్తూ పోస్టులు చేస్తున్నారు. పెరిగిన రేట్లు, ఎక్స్‌ట్రా షోలకు సంబంధించి ఏపీ ప్రభిత్వం లేఖ కూడా రిలీజ్ చేసారు. దీని ప్రకారం ఏపీలో మొదటి రోజు ఏడు షోలు, ఆ తర్వాత 9 రోజుల పాటు అయిదు షోలు పర్మిషన్ ఇచ్చారు. అలాగే రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్ కి 110 రూపాయలు, లోయర్ క్లాస్ కి 60 రూపాయలు, మల్టిప్లెక్స్ లకు 135 రూపాయల వరకు పెంచుకోడానికి అనుమతి ఇచ్చారు.