Guppedantha Manasu : ముకుల్ ఎంట్రీతో వణికిపోతున్న దేవయాని.. అసలు ముకుల్ ఎవరు?

ముకుల్ తమ బండారం ఎక్కడ బయటపెడతాడో అని టెన్షన్ పడుతుంది దేవయాని. మరోవైపు కోల్పోయిన తన గతాన్ని తిరిగి పొందాలనుకుంటుంది అనుపమ. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu

Guppedantha Manasu : ముకుల్‌ని చూస్తే భయంగా ఉందంటుంది దేవయాని..తల్లికి భయపడొద్దని ధైర్యం చెప్తాడు శైలేంద్ర. మరోవైపు తన జీవితంలో కోల్పోయింది తిరిగి పొందాలనుకుంటున్నాను అని తన పెద్దమ్మకి చెబుతుంది అనుపమ. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?

రిషిని పెద్దమ్మ దేవయాని దగ్గరకు ఎందుకు వెళ్లావని అడుగుతాడు మహేంద్ర. స్పెషల్ ఆఫీసర్ ముకుల్‌ని దేవయాని కుటుంబానికి పరిచయం చేసానని చెబుతాడు రిషి. ముకుల్ జగతి స్టూడెంట్ అని.. త్వరలోనే జగతిని చంపిన నేరస్తులు ఎవరో తెలుస్తుందని అంటాడు రిషి. ఒకసారి ముకుల్‌ని ఇంటికి పిలుస్తానని మహేంద్రని కూడా ఒకసారి మాట్లాడమని చెబుతాడు. రిషితో చాలా మంచి పని చేసావని అంటాడు మహేంద్ర. రిషి శత్రువులను కనిపెట్టడంలో ఒక అడుగు ముందుకు వేశాడని మహేంద్రతో అంటుంది వసుధర. త్వరలోనే దేవయాని, శైలేంద్రల బండారం బయటపడితే అప్పుడే తనకు మనశ్శాంతిగా ఉంటుదంటాడు మహేంద్ర.

Guppedantha Manasu : రిషి, వసుధరల ఫస్ట్ నైట్.. జగతి వారికి బిడ్డగా పుట్టాలని కోరుకున్న మహేంద్ర..

అనుపమ మహేంద్ర, జగతి గురించి ఆందోళన పడుతుంది. మహేంద్రకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎలాగైనా మహేంద్రని కలిసి నిజాలు తెలుసుకోవాలని అనుకుంటుంది. తన పెద్దమ్మతో తన గతం తనను చాలా డిస్ట్రబ్ చేస్తోందని అంటుంది. తాను కోల్పోయింది తిరిగి పొందాలని అనుకుంటున్నాను అని చెబుతుంది. అనుపమని ఓదార్చిన ఆమె పెద్దమ్మ ఎప్పుడూ తన సహాయం ఉంటుందని చెబుతుంది.

రిషిని ఇంటికి తిరిగి రమ్మని పిలిస్తే ఎంక్వైరీకి ఒక మనిషిని తీసుకువస్తాడని అనుకోలేదంటుంది దేవయాని ఫణీంద్రతో. రిషి చాలా మారిపోయాడని అందుకు కారణం మహేంద్ర అని నిందలు వేస్తుంది. మహేంద్ర తాగుడికి బానిస కాకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అంటుంది. దేవయాని మాటలకు మండిపడతాడు ఫణీంద్ర. పిచ్చి మాటలు మాట్లాడొద్దని .. మహేంద్ర కుటుంబం విషయంలో కలగజేసుకుంటే తన కోపం చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు. తండ్రిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కోపం తెప్పించవద్దని జాగ్రత్తగా ఉండమని శైలేంద్ర దేవయానికి చెప్తాడు.

Guppedantha Manasu : జగతి ఏమైందని మహేంద్ర కాలర్ పట్టుకుని నిలదీసిన అనుపమ.. మహేంద్ర నిజం చెప్పేస్తాడా?

రిషి, వసుధర కాలేజీలో బోర్డు మీటింగ్ కోసం బయలుదేరతారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. గుప్పెడంత మనసు సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.