Guppedantha Manasu : జగతి ఏమైందని మహేంద్ర కాలర్ పట్టుకుని నిలదీసిన అనుపమ.. మహేంద్ర నిజం చెప్పేస్తాడా?
అనుపమ ఏమైందని మహేంద్ర కాలర్ పట్టుకుని నిలదీస్తుంది అనుపమ. జగతి లేదన్న విషయం మహేంద్ర అనుపమకి చెప్పేస్తాడా? గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu
Guppedantha Manasu : వసుధరతో తనపై అటాక్ జరిగిందని చెబుతాడు రిషి. తన శత్రువులు ఎవరో తనకు తెలియట్లేదని చెబుతాడు. మరోవైపు అనుపమని కలుస్తాడు మహేంద్ర. ఆ తరువాత ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?
వసుధరతో తనపై ఎవరో కారుతో అటాక్ చేసారని చెప్తాడు రిషి. తన శత్రువులు ఎవరో తనకు తెలియట్లేదని ఆవేదన చెందుతాడు. శత్రువులు ఎక్కడో ఉండరని మన చుట్టూనే ఉంటారని.. ప్రశాంతంగా ఆలోచిస్తే ఎవరో తెలుస్తుందని చెబుతుంది వసుధర. రిషిపై అటాక్ చేసింది.. చేస్తున్నది ఎవరో తెలిసి చెప్పలేకపోతున్నందుకు బాధపడుతుంది వసుధర.
అనుపమని కలవడానికి వెళ్తాడు మహేంద్ర. జగతి ఎక్కడుంది? నువ్వు మాత్రమే ఒంటరిగా ఎందుకు ఇక్కడికి వచ్చావని మహేంద్రని కాలర్ పట్టుకుని అడుగుతుంది అనుపమ. మహేంద్ర ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పలేనని అంటాడు. అనుపమ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నిస్తాడు. జగతితో ఉన్నప్పుడు తన గురించి మాట్లాడతానంటుంది అనుపమ. మహేంద్రను అనుపమ రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. రిసార్ట్ బయట మహేంద్ర అనుపమతో మాట్లాడటం చూస్తుంది వసుధర. మహేంద్ర మాట్లాడుతున్న ఆమె ఎవరో అర్ధం కాక ఆలోచిస్తుంది.
Guppedantha Manasu : జగతి, మహేంద్ర ప్రేమ కథ మొదలైంది అరకులోనా? మహేంద్ర గతం ఏంటి?
మహేంద్రని తమతో డిన్నర్ చేయమని అడుగుతారు రిషి, వసుధర. తను తిని వచ్చానని మీరు తినండి అంటూ మహేంద్ర తన రూమ్‌లోకి వెళ్లిపోతాడు. తండ్రిలో కొద్దిగా మార్పు వస్తోందని అంటాడు రిషి వసుధరతో. వసుధర కూడా మహేంద్ర కలిసిన లేడీ ఎవరై ఉంటారా? అని ఆలోచిస్తుంది. ఆమెతో మహేంద్రకు ఉన్న అనుబంధం ఏంటని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే. ఆద్యంతం ఆసక్తి రేపుతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.