Guppedantha Manasu : హనీమూన్‌లో మరింత దగ్గరైన రిషి, వసుధర.. వాళ్లెక్కడ ఉన్నారో శైలేంద్రకు తెలిసిపోయిందా?

హనీమూన్ కి వెళ్లిన రిషి, వసుధర మరింత దగ్గరవుతారు. వాళ్లెక్కడికి వెళ్లారో తెలిసుకోవాలని శైలేంద్ర ఆరాటపడిపోతుంటాడు. తల్లితో కలిసి కొత్త ప్లాన్స్‌కి సిద్ధమవుతాడు? గుప్పెడంత మనసు సీరియల్ లో ఏం జరిగింది?

Guppedantha Manasu : హనీమూన్‌లో మరింత దగ్గరైన రిషి, వసుధర.. వాళ్లెక్కడ ఉన్నారో శైలేంద్రకు తెలిసిపోయిందా?

Guppedantha Manasu

Updated On : October 21, 2023 / 11:16 AM IST

Guppedantha Manasu : మహేంద్ర, రిషి, వసుధర ఎక్కడ ఉన్నారో? ఏం చేస్తున్నారో తెలియక శైలేంద్ర విలవిలాడిపోతుంటాడు. రిషి నంబర్‌కి ఫోన్ చేస్తాడు. ఫోన్ తీసిన వసుధర శైలేంద్రకి ఏం చెబుతుంది? ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో ఏం జరిగింది?

Guppedantha Manasu : హనీమూన్‌కి వెళ్లిన రిషి, వసుధర.. మహేంద్రను కలసిన కొత్త క్యారెక్టర్ ఎవరు?

రిషి, వసుధర సైట్ సీయింగ్‌కి వెళ్దామని మహేంద్రని అడుగుతారు. మహేంద్ర వాళ్లిద్దర్నీ వెళ్లి రమ్మంటాడు. వసుధరని తనను సార్ అని పిలవొద్దని మావయ్యా అని నోరార పిలవమని అడుగుతాడు. వసుధర అలాగే పిలవడంతో సంతోష పడతాడు. రిషి, వసుధర అరకు అందాల్ని చూడటానికి వెళ్తారు. ఇద్దరు మరికొంచెం దగ్గరవుతారు. రిషి కుటుంబం ఎక్కడికి వెళ్లారో? ఏం చేస్తున్నారో తెలియక శైలేంద్ర రగులుకుపోతుంటాడు. ఆగలేక రిషికి ఫోన్ చేస్తాడు. వసుధర ఫోన్ తీసి విషయం ఏంటని అడుగుతుంది. ఎక్కడ ఉన్నారో? ఏమైనా అవసరం ఉందేమో తెలుసుకుందామని ఫోన్ చేసానని చెబుతాడు. తాము చాలా సంతోషంగా ఉన్నామని తమకి ఏం అవసరం లేదని వసుధర ఫోన్ పెట్టేస్తుంది.

రిషి వాళ్లు ఎక్కడికి వెళ్లారో తండ్రి ఫణీంద్రకు ఖచ్చితంగా తెలిసే ఉంటుందని తండ్రిని అడగమని తల్లి దేవయానికి చెబుతాడు శైలేంద్ర.  దేవయాని ఫణీంద్రతో రిషి మీద బెంగగా ఉందని వాళ్లకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కోమని అడుగుతుంది. ఫణీంద్ర దేవయానిపై మండిపడతాడు. నీ వల్లే నా తమ్ముడు మహేంద్ర కుటుంబం బయటకి వెళ్లాల్సి వచ్చిందని తిట్టి పోస్తాడు. వాళ్లు సంతోషంగా ఉండటానికి బయటకు వెళ్లారని తనకు తెలుసుకోవాలని అనిపించినప్పుడు వాళ్లకి ఫోన్ చేస్తానని చీవాట్లు పెడతాడు.

Guppedantha Manasu : జగతి, మహేంద్ర ప్రేమ కథ మొదలైంది అరకులోనా? మహేంద్ర గతం ఏంటి?

శైలేంద్ర రిషికి అసలు ఎందుకు ఫోన్ చేసాడో తెలియక వసుధర దిగులు పడుతుంది. ఒంటరిగా బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరు తాగుబోతులు అటువైపుగా వచ్చి వసుధరని అల్లరి పెట్టాలని చూస్తారు. వెంటనే మహేంద్ర అక్కడికి వచ్చి వాళ్లని బెదిరించడంతో వాళ్లు పారిపోతారు. ఒంటరిగా అక్కడ ఏం చేస్తున్నావ్? అని వసుధరని అడుగుతాడు మహేంద్ర. శైలేంద్ర రిషికి ఫోన్ చేసాడని ఎందుకు చేసాడో తెలియట్లేదని వసుధర చెబుతుంది. శైలేంద్ర చేసిన కుట్రలు ఆధారాలతో సహా సంపాదించి రిషి ముందు పెట్టాలంటాడు మహేంద్ర. తాను అదే పనిలో ఉన్నానంటుంది వసుధర. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని ప్రశ్నిస్తాడు . అప్పుడు వాళ్లేం చెప్పారు? నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

‘గుప్పెడంత మనసు’ సీరియల్ చాలా ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకాదరణ పొందుతోంది. ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరియల్ ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.