Guppedantha Manasu : హనీమూన్‌కి వెళ్లిన రిషి, వసుధర.. మహేంద్రను కలసిన కొత్త క్యారెక్టర్ ఎవరు?
కాలేజీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక వసుధరకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. మరోవైపు తాగుడుకు బానిస అయిన మహేంద్రని తీసుకుని హాలీడే ట్రిప్‌కి వెళ్తారు రిషి, వసుధర.. మహేంద్ర జీవితంలో అనుకోని ట్విస్ట్ ఎదురవుతుంది.

Guppedantha Manasu
Guppedantha Manasu : కాలేజీ ఎండీగా వసుధర బాధ్యతలు స్వీకరిస్తుంది. దేవయాని, శైలేంద్ర వసుధర గురించి మాట్లాడుకుంటుంటే రిషి వింటాడు. ఆ తరువాత ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో ఏం జరిగింది?
వసుధర కాలేజీ ఎండీ సీట్లో కూర్చోవడం దేవయాని, శైలేంద్ర జీర్ణించుకోలేకపోతారు. కాలేజీ బయట తమ కుట్రలు రివర్స్ అయిన విషయం మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటల్ని రిషి వింటాడు. వసుధర గురించేనా మాట్లాడుతున్నది? అని నిలదీస్తాడు. వసుధరరకి అనుభవం లేదు కాబట్టి ఆ పదవిలో పనిచేయగలదో లేదో అని మాట్లాడుకుంటున్నాం అని నీళ్లు నములుతాడు శైలేంద్ర. తనకి అన్ని అర్హతలు ఉండబట్టే మినిస్టర్ గారితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నానని వసుధర సమర్ధత మీద అనుమాన పడొద్దని రిషి అంటాడు.
దేవయాని, శైలేంద్ర వసుధర క్యాబిన్లోకి వెళ్తారు. వసుధరని ఇబ్బందిపెట్టేలా మాట్లాడతారు. వాళ్లిద్దర్ని అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది వసుధర. ఎండీ సీటులో కూర్చునే అర్హత తనకి లేదని వసుధర అనుకునేలా చేస్తానని శైలేంద్ర వసుధరకి వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు శైలేంద్ర కుట్రలో భాగంగా కాలేజీ సిబ్బంది జీతాలు పెంచమంటూ వసుధరని నిలదీస్తారు. అందుకు కొంచెం సమయం కావాలని అడుగుతుంది వసుధర. జీతాలు పెంచే విషయంలో నిర్ణయం తీసుకున్నాకే పనిచేస్తామని వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఏం చేయాలో పాలుపోక రిషికి విషయం చెబుతుంది వసుధర. రిషి కాలేజీకి వస్తాడు. స్టూడెంట్స్‌తో మాట్లాడి వారికి సమస్యను వివరిస్తాడు. తాను కొత్త స్టాఫ్‌ని తీసుకువస్తానని.. తాను కూడా ఇకపై లెక్చరర్‌గా క్లాసులు చెబుతానని చెప్పడంతో వారంతా అంగీకరిస్తారు.
మరోవైపు మహేంద్ర జగతిని మర్చిపోలేక మద్యానికి బానిస అవుతాడు. ఫణీంద్ర, దేవయాని, శైలేంద్ర మహేంద్ర కుటుంబాన్ని తిరిగి ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్తారు. మహేంద్ర ససేమిరా రానంటాడు. రిషి తండ్రిని కొద్దిరోజులు బయటకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్తాడు. రిషి, వసుధర, మహేంద్రతో కలిసి హాలీ డే ట్రిప్‌కి వెళ్తారు. వాళ్లు సంతోషంగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న సమయంలో అనుహ్యంగా ఓ సంఘటన జరుగుతుంది? ఏంటది? నెక్ట్స్ ఎపిసోడ్లో చూడాల్సిందే. ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.