Guppedantha Manasu : శైలేంద్ర గురించి ధరణి రిషికి చెప్పేస్తుందా? ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?

కాలేజీ ఎండీగా రిషి వసుధరని నిర్ణయించడం దేవయాని, శైలేంద్ర జీర్ణించుకోలేకపోతారు. కోపంతో రగిలిపోతున్న భర్త విషయంలో ధరణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?

Guppedantha Manasu : శైలేంద్ర గురించి ధరణి రిషికి చెప్పేస్తుందా? ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?

Guppedantha Manasu

Updated On : October 14, 2023 / 11:47 AM IST

Guppedantha Manasu : వసుధరకి కాలేజీ ఎండీగా ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయంటాడు రిషి. అతని నిర్ణయాన్ని మంత్రితో పాటు ఫణీంద్ర అందరూ సమర్ధిస్తారు. దేవయాని అందుకు విరుద్ధంగా మాట్లాడుతుంది. అప్పుడు రిషి ఏం చెప్పాడు? ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగిందంటే?

Guppedantha Manasu : కాలేజ్ ఎండీగా వసుధర.. దేవయాని, శైలేంద్రకు ఊహించని షాక్

వసుధరని కాలేజీ ఎండీగా నియమించాలని రిషి తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి సమర్ధిస్తాడు. ఆ సీట్లో రిషికి ఎంత సమర్ధత ఉందో వసుధరకి అంతే సమర్ధత ఉందని అంటాడు. దేవయాని మాత్రం ఆడపిల్ల కదా అంత పెద్ద బాధ్యతను తను ఎలా తీసుకోగలదు? అని ప్రశ్నిస్తుంది. జగతి స్త్రీయే కదా.. ఆమె ఎంతో సమర్ధవంతంగా కాలేజీ బాధ్యతలు నిర్వహించిందని మంత్రి గుర్తు చేస్తాడు. దేవయాని, శైలేంద్ర వసుధరని రిషి ఎండీగా నియమించడం పట్ల రగులుకుపోతుంటారు. రిషి వసుధరని దగ్గరుండి ఎండీ సీట్లో కూర్చోపెడతాడు. అందరి చప్పట్ల మధ్య వసుధర ఎండీ బాధ్యతలు చేపడుతుంది. రిషి, వసుధర కాలేజీని నంబర్ వన్ పొజిషన్‌కి తీసుకురావాలని కోరతాడు.

ఎండీ సీట్లో కూర్చున్న వసుధరని ‘తెగ సంబరపడిపోతున్నట్లున్నావ్?’ అంటూ దేవయాని వెక్కిరిస్తుంది. ‘అందరూ జగతి మేడంలా ఉండరు.. నేను ఆవిడలా మంచిదాన్ని కాదు’ అంటుంది వసుధర. ‘నేను ఎండీ సీట్లో కూర్చున్నందుకు చాలా డిజప్పాయింట్ అయినట్లున్నారు’ అంటూ శైలేంద్రని ప్రశ్నిస్తుంది. ‘నాకు కోపం తెప్పించకు వసుధర’ అంటాడు శైలేంద్ర. రిషి అక్కడికి రావడంతో శైలేంద్ర, దేవయాని అక్కడి నుంచి వెళ్లిపోతారు. తనని ఎండీ సీట్లో మనస్ఫూర్తిగానే కూర్చోపెట్టారా? అని రిషిని అడుగుతుంది వసుధర. గతంలో చేసినట్లు ఏ తప్పు చేయనని.. ఇంకెప్పుడు నీ చేయి విడువను అని వసుధరకి రిషి ప్రామిస్ చేస్తాడు.

Guppedantha Manasu : రిషికి చక్రపాణి చెప్పిన రహస్యం ఏంటి? వసుధరను రిషి ఎందుకు క్షమాపణ అడుగుతాడు?

ఇంటికి వచ్చిన శైలేంద్ర ఎండీ సీటు తనకి దగ్గనందుకు కోపంతో చిందులు వేస్తుంటాడు. పలకరించిన భార్య ధరణిపై అరుస్తాడు. ‘మీ కుట్రలు ఆపేయండి.. ఇలాంటి సమయంలో ఏం జరుగుతుందో అని భయంగా ఉందంటుంది’ ధరణి. కోపంతో భార్యపై చేయి ఎత్తుతాడు శైలేంద్ర. ‘నీకు తెలిసిన నిజాల్ని నీలో సమాధి చేసుకో.. నా గురించి ఎవరి దగ్గర అయినా చెబితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు..మూలన పడి ఉండు’అంటూ భార్యని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రిషి మనసు కుదుటపడిన తర్వాత భర్త శైలేంద్ర చేసిన తప్పుల్ని చెప్పేయాలని డిసైడ్ అవుతుంది ధరణి. ‘గుప్పెడంత మనసు; సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు.