Guppedantha Manasu : తండ్రిని తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసిన రిషి.. దేవయాని నిజ స్వరూపం రిషికి తెలిసిపోయిందా?
దేవయాని తాగి వచ్చిన మహేంద్రని నానా మాటలు అంటుంది. రోజు ఇలా తాగి వచ్చి రభస చేస్తే తాను ఇంట్లోంచి వెళ్లిపోతానంటుంది. అలాంటి పరిస్థితుల్లో రిషి ఓ నిర్ణయం తీసుకుంటాడు. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu
Guppedantha Manasu : మహేంద్ర డ్రింక్ చేసి ఇంటికి రావడంతో దేవయాని మరిదిపై మండిపడుతుంది. నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. తండ్రిని దేవయాని అన్ని మాటలు అనడం చూసి రిషి ఓ నిర్ణయం తీసుకుంటాడు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?
మహేంద్ర డ్రింక్ చేసి వస్తాడు. దేవయాని మహేంద్ర తాగి రావడంతో నానా మాటలు అంటుంది. తండ్రి తన తల్లిపోయిన బాధలో అలా చేస్తున్నారని ఆయనను ఏమీ అనొద్దని అంటాడు రిషి. బాధ ఉందని తాగుతూ కూర్చుంటామా? ఇలా తాగి రభస చేస్తుంటే తాను ఇంట్లోంచి వెళ్లిపోతాను అంటుంది దేవయాని. దేవయానిని మందలిస్తాడు ఫణీంద్ర. తన తండ్రిని అన్ని మాటలు అంటుంటే తట్టుకోలేనని మనసు చంపుకుని ఇక్కడ ఉండలేనని తామే ఇంట్లోంచి వెళ్లిపోతాం అంటాడు రిషి. దేవయాని, శైలేంద్ర వెళ్లొద్దని నటిస్తారు. ఫణీంద్ర ఎంత బ్రతిమాలిన రిషి వసుధర, మహేంద్రని తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు.
Guppedantha Manasu : రిషికి చక్రపాణి చెప్పిన రహస్యం ఏంటి? వసుధరను రిషి ఎందుకు క్షమాపణ అడుగుతాడు?
తండ్రి పరిస్థితి చూసి రిషి బాధపడతాడు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని మంచి రోజులు వస్తాయని వసుధర రిషికి ధైర్యం చెబుతుంది. రిషి, వసుధరని తీసుకుని కాలేజ్‌కి వెళ్తాడు. వసుధరని ఎండీగా అంగీకరిస్తూ బోర్డు సభ్యులంతా సంతకాలు పెడతారు. దేవయాని, శైలేంద్రని కూడా సంతకాలు పెట్టడానికి పిలిపిస్తాడు రిషి. తప్పనిసరి పరిస్థితుల్లో శైలేంద్ర, దేవయాని సంతకాలు పెడతారు. వసుధర ఎండీగా ఉండటానికి అంగీకరిస్తూ సంతకం పెడుతుంది. వసుధరని ఎండీ సీట్లో కూర్చోపెట్టి తనకు పని ఉందని రిషి అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు.