Ram Charan-Sukumar: ఒక్క ఫోటోతో రూమర్స్ చెక్.. రామ్ చరణ్- సుక్కు మూవీపై క్లారిటీ వచ్చేసింది
రామ్ చరణ్- సుకుమార్(Ram Charan-Sukumar) మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Devi sri prasad composing music for ram charan- sukumar movie
- మళ్ళీ సెట్స్ పైకి ‘రంగస్థలం’ కాంబో
- దేవి శ్రీ ప్రసాద్‌పై వస్తున్న ప్రచారానికి ఎండ్ కార్డ్
- మైత్రీ మూవీ మేకర్స్ సైలెంట్ రిప్లై
Ram Charan-Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కావడంతో, ఈ కొత్త సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి. అయితే, సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉండటం ఆనవాయితీ.
రంగస్థలం సినిమాకి కూడా దేవి ఇచ్చిన మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, చరణ్-సుకుమార్(Ram Charan-Sukumar) కాంబోలో రాబోతున్న రెండవ సినిమాకు మాత్రం దేవి స్థానంలో ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ శాశ్వత్ సచ్దేవ్ను తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. దీనికి మైత్రీ మూవీ మేకర్స్, డీఎస్పీ మధ్య ఉన్న మనస్పర్థలే కారణమంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి.
Nidhi Agarwal: గ్లామర్ డోస్ పెంచేసిన నిధి అగర్వాల్.. ఆ కిల్లర్ లుక్స్‌కి కుర్రకారు ఫిదా!
కానీ, ఒకే ఒక్క ఫొటోతో ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ వేడుకల్లో సుకుమార్ కి పుష్ప 2 సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఆ సమయంలో సుకుమార్ అందుబాటులో లేకపోవడంతో చిత్ర నిర్మాతలు అవార్డును తీసుకున్నారు. తాజాగా, అదే అవార్డుతో సుకుమార్, మైత్రి నిర్మాతలు, దేవి శ్రీ ప్రసాద్ కలిసి ఫోటోలను పోజులు ఇచ్చారు. అందరు నవ్వుతూ ఉన్న ఆ గ్రూప్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ ఒక్క ఫోటోతో గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్లకు మేకర్స్ చెక్ పెట్టారు. దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారి బంధం ఇప్పటికీ బలంగానే ఉందని ఈ ఫోటో ద్వారా స్పష్టమైంది. దీంతో రామ్ చరణ్ సినిమాకు కూడా డీఎస్పీనే మ్యూజిక్ అందిస్తాడని స్పష్టం అయ్యింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక సమాచారం కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు నుంచి క్రేజీ న్యూస్ పంచుకోనున్నారు మేకర్స్.
