Devi Sri Prasad : దేవిశ్రీ కి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ మ్యూజిక్ మ్యాగజైన్ కవర్ పై!
టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అరుదైన గౌరవం అందుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన లెజెండరీ ఇంటర్నేషనల్ మ్యూజిక్ మ్యాగజైన్..

Devi Sri Prasad cover internation music magazine Rolling Stone
Devi Sri Prasad : టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సంగీతంతో మాస్ ఆడియన్స్ ని మాత్రమే లవర్స్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని కూడా అలరిస్తుంటాడు. దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన దేవిశ్రీ.. సింగర్ గా, లిరిక్ రైటర్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. సౌత్ లో ఎంతోమంది స్టార్ హీరోల సీన్లకు సంగీతం అందించిన దేవిశ్రీ.. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు మ్యూజిక్ చేశాడు. ఇక పుష్ప 1 (Pushpa 1) సినిమాతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.
Amala Paul : కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు కూడా సిద్దమే.. అమలాపాల్!
శ్రీవల్లి, ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్స్ తో దేశంలోని ప్రతి ఒకర్ని స్టెప్పులు వేసేలా చేశాడు. కేవలం ఇండియాలోనే కాదు ఫారిన్ సింగర్స్ కూడా ఈ మ్యూజిక్ కి ఫిదా అయ్యిపోయారు. ప్రస్తుతం అందరూ పుష్ప 2 కి ఎటువంటి ట్యూన్స్ రెడీ చేస్తున్నాడో అని ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే, దేవిశ్రీ ప్రసాద్ అరుదైన గౌరవం అందుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన లెజెండరీ ఇంటర్నేషనల్ మ్యూజిక్ మ్యాగజైన్ రోలింగ్ స్టోన్ (Rolling Stone) కవర్ పేజీ పై దేవిశ్రీ ప్రసాద్ స్తానం దక్కించుకున్నాడు.
NTR – Allu Arjun : పుష్ప 2 సెట్స్ లో ఎన్టీఆర్.. పిక్ వైరల్!
ఈ విషయాన్ని తెలియజేస్తూ రోలింగ్ స్టోన్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. “తన మ్యూజిక్ స్టైల్ తో, చార్ట్ బస్టర్ హిట్స్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్.. ఈ నెల మా మ్యాగజైన్ పేజీని కవర్ చేశారు” అంటూ కవర్ పేజీ ని పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా దేవిశ్రీ ప్రస్తుతం పుష్ప 2 తో సూర్య కంగువ, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ RC16 సినిమాలకు పని చేస్తున్నాడు.
ThankU dear @RollingStoneIN @RollingStone & the whole Team ❤️???
ThankU @Aruntitan for this Lovely Click !! ??
ThankU @amritharam2 for d Cool Outfit ?? https://t.co/a5QAfFcJuU
— DEVI SRI PRASAD (@ThisIsDSP) April 27, 2023