ధనుష్ 40 ‘జగమే తంత్రం’..

కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో రూపొందుతున్న ‘జగమే తంత్రం’ మోషన్ పోస్టర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 19, 2020 / 12:36 PM IST
ధనుష్ 40 ‘జగమే తంత్రం’..

Updated On : February 19, 2020 / 12:36 PM IST

కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో రూపొందుతున్న ‘జగమే తంత్రం’ మోషన్ పోస్టర్ రిలీజ్..

కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘డి 40’ (ధనుష్) ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ తాజాగా విడుదల చేశారు.

తమిళ్‌లో ‘జగమే తంతిరమ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఆయన పక్కన ఐశ్వర్యా లక్ష్మీ కథానాయిక.

 

D 40

సంతోష్ నారాయణన్, ఆర్ఆర్ బాగుంది. సమ్మర్ స్పెషల్‌గా 2020 మే 1న తమిళ్, తెలుగు భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు. సంగీతం : సంతోష్ నారాయణన్, కెమెరా : శ్రీయాస్ కృష్ణ, ఎడిటింగ్ : వివేక్ హర్షన్.