Dhanush : విడాకుల తర్వాత తనయులతో కలిసి మొదటిసారి బయటకి వచ్చిన ధనుష్..

కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌-ఐశ్యర్య ఈ ఏడాది జనవరి 17న విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జంటకి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11)..

Dhanush : విడాకుల తర్వాత తనయులతో కలిసి మొదటిసారి బయటకి వచ్చిన ధనుష్..

Dhanush

Updated On : March 20, 2022 / 3:31 PM IST

 

Dhanush :  కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌-ఐశ్యర్య ఈ ఏడాది జనవరి 17న విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరు విడిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా బాధపడ్డారు. ఈ జంటకి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో వీరితో కలిసి పలు ఫ్యామిలీ ఫోటోలని కూడా షేర్ చేశారు ధనుష్, ఐశ్వర్య.

BiggBoss Non Stop : వన్ సెకండ్.. బిగ్‌బాస్ ఓటీటీలో ఓంకార్..

వీరు విడాకులు తీసుకుని మూడు నెలలు అవుతున్నా ఒక్కసారి కూడా పిల్లలని బయటకి తీసుకురాలేదు ఇద్దరూ. ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా విడాకుల అనంతరం ధనుష్‌ తనయులతో కలిసి మొదటిసారి బయటకి వచ్చాడు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కు యాత్రా రాజా, లింగ రాజాలతో కలిసి ధనుష్ హాజరయ్యాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనయులతో ధనుష్ ఫోటోలు చూసిన అభిమానులు పక్కన ఐశ్వర్య కూడా ఉండి ఉంటే ఫ్యామిలీ ఫొటోలా బాగుండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.