Captain Miller Teaser : మోస్ట్ వాంటెడ్ ‘కెప్టెన్ మిల్లర్’.. ధనుష్ కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్..

తాజాగా నేడు ధనుష్ పుట్టిన రోజు కావడంతో కెప్టెన్ మిల్లర్ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ అంతా ఎక్కువ పోరాట సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి.

Captain Miller Teaser : మోస్ట్ వాంటెడ్ ‘కెప్టెన్ మిల్లర్’.. ధనుష్ కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్..

Dhanush Captain Miller Movie Teaser Released on his Birthday

Updated On : July 28, 2023 / 7:05 AM IST

Dhanush Captain Miller Teaser :  తమిళ్ హీరో ధనుష్ త్వరలో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాతో రాబోతున్నాడు. బ్రిటిష్ కాలం నాటి కథతో ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ కిషన్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ధనుష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

తాజాగా నేడు ధనుష్ పుట్టిన రోజు కావడంతో కెప్టెన్ మిల్లర్ టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ అంతా ఎక్కువ పోరాట సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళకి, కెప్టెన్ మిల్లర్ కి మధ్య జరిగే కథలా ఉంది. ధనుష్ ఫుల్ మాస్ యాక్షన్ సీన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సందీప్ కిషన్, ప్రియాంక మోహన్ కూడా పవర్ ఫుల్ యాక్షన్ రోల్స్ చేయనున్నారు.

Kushi : విజయ్, సమంతల ఖుషి టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. తను కనబడిన, వినబడిన..!

కెప్టెన్ మిల్లర్ ఫుల్ మాసీ యాక్షన్ టీజర్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాని డిసెంబర్ 15న విడుదల చేయనున్నారు.