sir movie
Sir Movie : తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, తమిళ స్టార్ హీరో ధనుష్ కలయికలో వచ్చిన రీసెంట్ మూవీ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ధనుష్ కెరీర్ లో మొదటి బై లింగువల్ మూవీ. తెలుగు నిర్మాణ సంస్థలు శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ మూవీలో ధనుష్ కి జంటగా సంయుక్త నటించింది. డైరెక్టర్ వెంకీ అట్లూరి.. తన మునపటి సినిమాల జోనర్ నుంచి బయటకి వచ్చి, ఒక సోషల్ ఎలిమెంట్ తో ఈ చిత్రాన్ని మలిచాడు. చదువుని వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఈ మూవీని తెరకెక్కించారు.
Sir Movie : తన రికార్డు తానే బ్రేక్ చేయడమే కాదు.. బాలీవుడ్ హీరో కలెక్షన్స్ కూడా బ్రేక్ చేసిన ధనుష్..
ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వగా, మొదటి రోజు నుంచే కలెక్షన్స్ దూకుడు చూపిస్తుంది. ఈ మూవీకి తమిళనాడు లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ప్రీమియర్ షోలు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50కు పైగా ప్రీమియర్స్ పడడంతో అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. ధనుష్ సూపర్ హిట్ మూవీ ‘రఘువరన్ బీ-టెక్’ లైఫ్ టైం కలెక్షన్స్ ని క్రాస్ చేసింది.
ఇక మొదటి వీకెండ్ పూర్తి చేసుకోగా చిత్ర నిర్మాతలు కలెక్షన్స్ అనౌన్స్ చేశారు. మూడు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ సాధించింది. దీనిబట్టి చూస్తే నెట్ షేర్ రూ.25 కోట్లు వచ్చినట్లు అర్ధమవుతుంది. దీంతో ఈ మూవీ బడ్జెట్ లో 90 శాతం కేవలం మూడు రోజుల్లోనే రాబట్టి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా సార్ మూవీ నిలిచింది. ఈ సినిమాతో ధనుష్ కి తెలుగులో గ్రాండ్ ఎంట్రీ వచ్చింది. త్వరలో మరో టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కములతో కూడా ఒక సినిమా పట్టాలెక్కించబోతున్నాడు.
Let’s gooo ?? @dhanushkraja @SitharaEnts #VenkyAtluri pic.twitter.com/PbBuw8zWUQ
— G.V.Prakash Kumar (@gvprakash) February 20, 2023