Dhanush : ఈ సినిమాలో అసలు ఎవరు నటించారో కూడా నాకు తెలీదు.. ధనుష్ కామెంట్స్..
ఈ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ..

Dhanush Speech in Kuberaa Pre Release Event
Dhanush : నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఈ సినిమా జూన్ 20 రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు.
Also Read : Kuberaa Trailer : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ ట్రైలర్ వచ్చేసింది..
ఈ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. నేడు ఫాదర్స్ డే. మా నాన్న నా కంటే ఎక్కువ కష్టపడి మా కోసం చాలా చేసాడు. ఇది తెలుగులో సర్ కంటే ముందు ఒప్పుకున్న సినిమా. తెలుగులో నాకు ఇది రెండో సినిమా. తమిళ్ లో 51వ సినిమా. శేఖర్ కమ్ముల గారికి ఆరోగ్యం బాగోకపోయినా చాలా కష్టపడ్డారు. డబ్బులను, కలెక్షన్స్ ని మించి కొన్ని సినిమాలు ఉంటాయి. ఈ సినిమా అలాంటిది. నాకు ఈ సినిమాలో చాలామంది నటిస్తున్నారని తెలీదు. ఇప్పుడు ట్రైలర్ చూసాక వీళ్లంతా యాక్ట్ చేసారా అని ఆశ్చర్యపోతున్నా. నేను నటించిన సీన్స్ లో ఉన్న వాళ్ళు కాకుండా వేరేవాళ్లు అసలు ఎవరు నటించారు కూడా నాకు తెలీదు. నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగి ఇప్పుడు మీతో నటించడం గర్వంగా అంది. మా సిస్టర్స్ కి మీరంటే కృష్ అని అన్నారు.