Dhanya Balakrishna
Dhanya Balakrishna : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్ గా, కీలక పాత్రలు చేస్తూ దూసుకెళ్తుంది ధన్య బాలకృష్ణ. ధన్య నటించిన ది 100 సినిమా జులై 11న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధన్య మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ధన్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబుకి ప్రపోజ్ చేసే సీన్ లో నటించింది.
ధన్య మహేష్ గురించి, ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా సమయానికి నాకు తెలుగు రాదు. చెన్నై నుంచి వచ్చాను. ఫస్ట్ సీనే ప్రపోజల్ సీన్. మహేష్ గారి కళ్ళు చూసి చెప్పాలి అన్నారు. నాకు భయం వేసింది. పెద్ద స్టార్స్ మనం టేక్స్ ఎక్కువ తీసుకుంటే ఏమనుకుంటారో, చిరాకుపడతారో అని భయం. అప్పటికి రెండు టేకులు తీసుకున్నాను. నేను వెంటనే మహేష్ గారికి సారీ చెప్పాను. ఆయన పర్లేదు టైం తీసుకో, డైలాగ్స్ నేర్చుకొని చెప్పు, నో ప్రాబ్లమ్ కూల్ అన్నారు. అలాంటి సమయంలో ఎదుటివాళ్ళు మన వల్ల ఇబ్బంది పడితే అస్సలు చేయలేము. కానీ ఆయన కూల్ గా మాట్లాడటంతో నేను కూల్ అయి డైలాగ్స్ చెప్పాను. నేను టేక్స్ తీసుకున్నా ఆయన కూల్ గానే ఉన్నారు అని తెలిపింది.
Also Read : HariHara VeeraMallu : ఆ వార్తలను ఖండించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ యూనిట్.. ఇది ఎవరి జీవిత కథ కాదు..