Vijay Deverakonda : ‘ది’ ట్యాగ్ వివాదంపై విజయ్ దేవరకొండ.. తీసేయమని చెప్పాను.. ఎవ్వర్నీ అనలేదు నా మీదే విమర్శలు..

ప్రతి స్టార్ హీరోకి పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుందని తెలిసిందే.

Vijay Deverakonda : ‘ది’ ట్యాగ్ వివాదంపై విజయ్ దేవరకొండ.. తీసేయమని చెప్పాను.. ఎవ్వర్నీ అనలేదు నా మీదే విమర్శలు..

Vijay Deverakonda

Updated On : July 8, 2025 / 8:10 PM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో జులై 31న రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. వరుసగా విజయ్ ఫ్లాప్స్ చూస్తుండటం, ఈ సినిమా టీజర్ కూడా అదిరిపోవడంతో కింగ్డమ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ క్రమంలో తన పేరు ముందు పెట్టుకున్న ది ట్యాగ్ గురించి మాట్లాడారు.

ప్రతి స్టార్ హీరోకి పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ ఉంటుందని తెలిసిందే. ఇటీవల కొత్తగా వచ్చిన హీరోలు, చిన్న హీరోలు కూడా ట్యాగ్స్ పెట్టుకుంటున్నారు. దీంతో విజయ్ దేవరకొండకు కూడా ఏదో ఒక ట్యాగ్ ఉండాలని ఫ్యాన్స్ కోరారు. కొంతమంది మీడియా రౌడీ స్టార్ అనే ట్యాగ్ తో రాసేవాళ్ళు. కానీ విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా సమయంలో ‘ది’ అనే ట్యాగ్ పెట్టుకున్నాడు. అయితే పలువురు ఈ ట్యాగ్ పై విమర్శలు చేసారు. అసలు ది టైటిల్ లో ఏముందో, అది ఎందుకు వద్దో చెప్పకుండా విజయ్ ని పలువురు ట్రోల్ చేసారు. ఓ నటి కూడా ఈ విషయంలో విజయ్ ని విమర్శించింది.

Also Read : HariHara VeeraMallu : ఆ వార్తలను ఖండించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ యూనిట్.. ఇది ఎవరి జీవిత కథ కాదు..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ది ట్యాగ్ వివాదంపై స్పందిస్తూ.. సినిమా పరిశ్రమలో ఆల్మోస్ట్ అందరికి ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. కానీ ఎవరికీ రానన్ని విమర్శలు నాకు వచ్చాయి. నా తర్వాత వచ్చినవాళ్లు, నాతో ఉన్నవాళ్లు అందరూ ఏదో ఒక స్టార్ ట్యాగ్ పెట్టుకున్నారు. నేను ‘ది’ పెట్టుకున్నందుకు విమర్శలు వచ్చాయి. నేను ఎప్పట్నుంచో ట్యాగ్ వద్దనుకున్నాను. మీడియా వాళ్ళు రకరకాల ట్యాగ్స్ పెట్టి రాసేవాళ్ళు. ఎందుకో నాకు తెలీదు. నేను విజయ్ దేవరకొండ గానే అందరికి తెలియాలి. ఒకవేళ ట్యాగ్ కావాలనుకుంటే ది చాలు అనుకున్నాను. అది పెట్టుకోగానే కొంతమంది అలా ఎలా పెట్టుకుంటావు అని విమర్శలు చేసారు. అది నేను కావాలనుకొని పెట్టుకున్నది కాదు. ఒకవేళ వద్దనుకుంటే తీసేస్తా. నా టీమ్ కి కూడా ది ట్యాగ్ తీసేయమని చెప్పాను. కానీ కొన్ని మన చేతిలో ఉండవు. అసలు అది పెద్ద మ్యాటర్ కాదు ది ఉన్నా లేకపోయినా నాకు. నా ఫేస్ చూసి సినిమాకు వస్తారు కానీ నా ట్యాగ్ చూసి కాదు అని తెలిపాడు.

Also Read : RK Sagar : ‘రంగస్థలం’లో ఆ పాత్రకు మొగలిరేకులు హీరోని అడిగారట.. ఒప్పుకున్నా కూడా..