RK Sagar : ‘రంగస్థలం’లో ఆ పాత్రకు మొగలిరేకులు హీరోని అడిగారట.. ఒప్పుకున్నా కూడా..

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు.

RK Sagar : ‘రంగస్థలం’లో ఆ పాత్రకు మొగలిరేకులు హీరోని అడిగారట.. ఒప్పుకున్నా కూడా..

RK Sagar

Updated On : July 8, 2025 / 6:28 PM IST

RK Sagar : సినీ పరిశ్రమలో ఒకరు చేయాల్సిన పాత్ర పలు కారణాలతో ఇంకొకరికి వెళ్తుందని తెలిసిందే. అలా రంగస్థలం సినిమాలో ఒక క్యారెక్టర్ కి మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్ ని అడిగారట. సాగర్ హీరోగా చేస్తున్న ‘ది 100’ సినిమా జులై 11 రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు.

సాగర్ మాట్లాడుతూ.. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చేసిన క్యారెక్టర్ నాకు చాలా ఎఫెక్ట్ అయింది. నాకు సెకండ్ లీడ్ అని చెప్పి వేరే చేయించారు. అది నాకు వద్దు అని వచ్చేసినా నాతో షూట్ చేసిన సీన్స్ ని సినిమాలో ఉంచారు. దాని వల్ల బాధపడ్డాను, అందరూ అడిగారు అలాంటి పాత్ర ఎందుకు చేసావు అని. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయకూడదు, చేస్తే హీరోగానే చేయాలి అని ఫిక్స్ అయ్యా.

Also Read : Vijay Deverakonda : నేను అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు.. ఇకపై ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వను.. నన్ను మాట్లాడొద్దు అన్నారు..

తర్వాత రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అన్నయ్య పాత్రకు నన్ను అడిగారు. అప్పుడు నాకు జరిగిన మిస్టర్ పర్ఫెక్ట్ ఇన్సిడెంట్ చెప్పాను. కానీ అలా జరగదు అని సుకుమార్ చెప్పారు. నేను ఆ క్యారెక్టర్ ఒప్పుకోలేదు. నేను నో చెప్పడంతో ఆది పినిశెట్టికి చెప్పారు. ఆయన కూడా మొదట ఒప్పుకోలేదు. అది నాకు తెలిసి నేను చేద్దాం అనిపించి సుకుమార్ గారికి ఆ పాత్రకు ఓకె చెప్పాను. కానీ ఆది పినిశెట్టి కూడా తర్వాత ఓకె చెప్పడంతో ఆయన్ని తీసుకున్నారు అని తెలిపాడు.