Vijay Deverakonda : నేను అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు.. ఇకపై ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వను.. నన్ను మాట్లాడొద్దు అన్నారు..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Vijay Deverakonda : నేను అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు.. ఇకపై ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వను.. నన్ను మాట్లాడొద్దు అన్నారు..

Vijay Deverakonda

Updated On : July 8, 2025 / 5:04 PM IST

Vijay Deverakonda : ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. మీడియాకు దూరమవుతున్నారు. ఇందుకు కారణం వాళ్ళు ఫ్లోలో మాట్లాడిన మాటలు, అనుకోకుండా చేసిన కామెంట్స్, లేదా నార్మల్ గా మాట్లాడిన మాటలను కూడా కొంతమంది నెగిటివ్ గా చూపిస్తూ వ్యతిరేక ప్రచారం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ కూడా తన సినిమాల గురించి, బయట ఈవెంట్స్ లో మాట్లాడిన మాటలకు కూడా పలువురు విమర్శలు చేసారు.

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా జులై 31న రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

Also Read : RK Sagar : ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా నాకు బ్యాడ్ ఇన్సిడెంట్.. సెకండ్ లీడ్ అని చెప్పి.. ఆ సినిమా చేసినందుకు బాధపడ్డాను..

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నేను ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వదలుచుకోలేదు. నన్ను ఎలాంటి స్టేట్మెంట్స్ చేయొద్దు అన్నారు. ఇది సెన్సిటివ్ వరల్డ్ అయిపోయింది. మనం ఏం మాట్లాడినా అందరికి వెళ్తుంది. ఇది ఎప్పుడు మొదలైందో నాకు తెలీదు. నేను ఇప్పటికి యాక్టర్ అనుకోను. ఒక నార్మల్ అబ్బాయినే అని ఫీల్ అవుతాను. అందుకే నేను మాట్లాడితే నా మైండ్ లో ఏం ఉందో అదే మాట్లాడతాను. నేనేం అనుభవం ఉన్నవాడిని కాదు. నేను ఏదైనా మాట్లాడితే దానికి కౌంటర్ గా ఇంకో వర్షన్ చెప్తే నేను ఓకె అనుకోని అది కూడా తెలుసుకుంటాను.

కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడినా అది ఆర్గ్యుమెంట్ కి తీసుకుంటున్నారు. కొంతమంది వాటిని ప్రమోట్ చేసి ఒక అజెండాలా ప్రాపగాండా చేస్తున్నారు. అందుకే నేను ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం మానేసాను. నేను ఫ్రీగా నాలా మాట్లాడలేకపోతే నేను మాట్లాడను. కొంతమంది ఏం మాట్లాడినా మనల్ని ఇష్టపడరు. మనం ఫ్రీగా మాట్లాడలేం ఇలాంటి సమయంలో. నా టీమ్ కూడా అన్న మీరు మాట్లాడకండి అని చెప్పారు. అన్నిటికి నవ్వి వెళ్లిపోవడం బెటర్. నాకు తెలిసిన కొంతమంది యాక్టర్స్ ఈ విషయంలో బాగా నటిస్తారు. అది వాళ్ళు కాదు కానీ కెమెరా ముందు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో వాళ్లకు తెలుసు అని అన్నారు. దీంతో విజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Pawan Kalyan : ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. పవన్ కళ్యాణ్ కి ఇస్తారా?