RK Sagar : ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా నాకు బ్యాడ్ ఇన్సిడెంట్.. సెకండ్ లీడ్ అని చెప్పి.. ఆ సినిమా చేసినందుకు బాధపడ్డాను..

తాజాగా సాగర్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా గురించి మాట్లాడుతూ..

RK Sagar : ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా నాకు బ్యాడ్ ఇన్సిడెంట్.. సెకండ్ లీడ్ అని చెప్పి.. ఆ సినిమా చేసినందుకు బాధపడ్డాను..

RK Sagar

Updated On : July 8, 2025 / 4:27 PM IST

RK Sagar : మొగలి రేకులు ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా తెరకెక్కిన ది 100 సినిమా జులై 11న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.

ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఆర్కే సాగర్ ప్రభాస్ ఫ్రెండ్ గా చిన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అప్పటికే సాగర్ మొగలిరేకులు సీరియల్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

Also Read : Pawan Kalyan : ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. పవన్ కళ్యాణ్ కి ఇస్తారా?

తాజాగా సాగర్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా గురించి మాట్లాడుతూ.. మిస్టర్ పర్ఫెక్ట్ అనేది నాకు బ్యాడ్ ఇన్సిడెంట్. ప్రభాస్ ఫ్రెండ్, సెకండ్ లీడ్ అని చెప్పారు. మొగలి రేకులు సీరియల్ తో బిజీగా ఉన్నప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చింది. డేట్స్ లేవు కానీ మొగలి రేకులు డైరెక్టర్ డేట్స్ అడ్జస్ట్ చేసారు. పెద్ద బ్యానర్, మంచి అవకాశం వచ్చిందని ఓకే అన్నాను. కానీ అక్కడ షూట్ కి వెళ్ళాక నేను అనుకున్నట్టు లేదు. నా పాత్రకు మూడు రోజులు షూట్ జరగలేదు. తర్వాత కొంత షూట్ చేసారు. డైరెక్టర్ దగ్గరికి వెళ్లి ఇది నాకు చెప్పిన క్యారెక్టర్ కాదు అని అడిగితే క్యారెక్టర్స్ మారతాయి అర్ధం చేసుకోండి అన్నారు.

సీరియల్ లో నేను బిజీగా ఉన్నా ఒక మంచి పాత్ర అన్నారని వచ్చాను ఇలా అయితే వద్దు, నా సీన్స్ తీసేయండి, వేరే వాళ్ళను పెట్టుకోండి అని ఆ సినిమా నుంచి వచ్చేసాను. అప్పటికి కొన్ని సీన్స్ చేసారు నా మీద దాంతో అవి సినిమాలో ఉంచారు. అది నాకు డిస్టబెన్స్ అయింది. మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజ్ అయ్యాక ఎందుకు అలాంటి క్యారెక్టర్ చేసారు అని వచ్చి నన్ను అడిగారు చాలామంది. నా ఫ్యాన్స్ బాధపడ్డారు. కొంతమంది సినీ పరిశ్రమ పెద్దవాళ్ళు కూడా ఫోన్ చేసి అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేసారు అని అడిగారు. నేను ఆ సినిమా చేసినందుకు అనవసరంగా చేశాను అని రిగ్రెట్ అయ్యాను అని తెలిపారు. దీంతో ఆర్కే సాగర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : RK Sagar : మొగలిరేకులు ఫేమ్ ‘ఆర్కే నాయుడు’ భార్య ఏం చేస్తుందో తెలుసా?