HariHara VeeraMallu : ఆ వార్తలను ఖండించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ యూనిట్.. ఇది ఎవరి జీవిత కథ కాదు..
తాజాగా మూవీ యూనిట్ దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తూ మీడియాకు సమాచారం ఇచ్చారు.

HariHara VeeraMallu
HariHara VeeraMallu : ఇటీవల పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా తెరకెక్కించారని వార్తలు వచ్చాయి. దీంతో పలువురు పవన్ సినిమాపై విమర్శలు కూడా చేసారు. తాజాగా మూవీ యూనిట్ దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తూ మీడియాకు సమాచారం ఇచ్చారు.
మూవీ యూనిట్ దీనిపై స్పందిస్తూ.. ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఈ సినిమా నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కింది. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత హరిహర వీరమల్లు కథ మారిపోయింది. డైరెక్టర్ కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ సరికొత్త కథగా దీనిని మలిచారు.
Also Read : RK Sagar : ‘రంగస్థలం’లో ఆ పాత్రకు మొగలిరేకులు హీరోని అడిగారట.. ఒప్పుకున్నా కూడా..
పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం మరియు వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో అలాగే హరిహర వీరమల్లును శివుడు మరియు విష్ణువుల అవతారంగా చూడబోతున్నాం. హరి(విష్ణు) హర(శివుడు) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు, విష్ణువుల అవతారం ‘వీరమల్లు’ అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే, కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి మరియు ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తాడు అని తెలిపారు.
ఇక ఈ సినిమాని ఎఎం రత్నం అత్యధిక బడ్జెట్ తో భారీస్థాయిలో నిర్మించారు. అసలే పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా, దానికితోడు సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా, ఇటీవల రిలీజయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే థియేటరికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.