Dhanya Balakrishnan: అలాంటి సీన్స్ చేసుంటే స్టార్ అయ్యేదాన్ని.. ఇక్కడ అవి తప్పదు.. కానీ, నాకు నేను ఇలా..
కర్ణాటక బ్యూటీ ధన్య బాలకృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవడానికి (Dhanya Balakrishnan)కన్నడ అమ్మాయే అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Dhanya Balakrishnan sensational comments about cinema industry
Dhanya Balakrishnan: కర్ణాటక బ్యూటీ ధన్య బాలకృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవడానికి కన్నడ అమ్మాయే అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కృష్ణలీల”.(Dhanya Balakrishnan) యంగ్ హీరో దేవన్ నటిస్తూ, డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Kantara: Chapter 1 OTT: ఓటీటీకి వచ్చేస్తున్న కాంతార: చాఫ్టర్ 1.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఇండస్ట్రీలో ఉండాలంటే రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చేయడం తప్పనిసరి అని సంచలన కామెంట్స్ చేసింది. ఇంకా ఈ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ.. ” కృష్ణలీల సినిమా అనేది నా కెరీర్ కు మళ్లీ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సినిమాపై మేము చాలా నమ్మకంగా ఉన్నాము. నిజానికి, సినిమాల విషయంలో నాకు నేను చాలా కండీషన్లు పెట్టుకున్నాను. అందుకే స్టార్ ని కాలేకపోయాను. ఇంటిమేట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ చేయొద్దని ముందే ఫిక్స్ అయ్యాను. అలా పెద్ద పెద్ద సినిమాను చాలా వదులుకున్నాను. అలాంటి సీన్స్ చేసుంటే స్టార్ స్టేటస్ ను అనుభవించేదాన్ని.
కానీ, నేను ఇప్పుడున్న పొజీషన్లోనే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే, నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటిది, ఈ స్థాయి వరకు వస్తానని ఎప్పుడు అనుకోలేదు. అదే, నాకు గొప్ప ఫీలింగ్ ను అందిస్తుంది. అలాంటి పెద్ద సినిమాలు చేయడం కంటే, మంచి సినిమాలు చేయడానికే ఇష్టపడతాను” అంటూ చెప్పుకొచ్చింది ధన్య బాలకృష్ణన్. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
