Dharmendra : ఒకప్పటి స్టార్ హీరో ఇక లేరు.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..

బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర నేడు మరణించారు. (Dharmendra)

Dharmendra : ఒకప్పటి స్టార్ హీరో ఇక లేరు.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..

Dharmendra

Updated On : November 11, 2025 / 9:24 AM IST

Dharmendra :

బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర నేడు మరణించారు. గత కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నేడు ఉదయం మరణించారు. ఈ విషయాన్ని ధర్మేంద్ర టీమ్ ప్రకటించారు.(Dharmendra)

శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 89 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు ధర్మేంద్ర. ఆయనకు ప్రకాశ్ కౌర్, హేమమాలిని ఇద్దరు భార్యలు ఉన్నారు. బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తొలి భార్య సంతానం. షోలే సినిమా సినిమా కంటే ముందే ఫేమ్ తెచ్చుకున్న ధర్మేంద్ర అమితాబ్ తో సమానంగా స్టార్ హీరోగా ఎదిగారు. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన్ని బాలీవుడ్ హి మ్యాన్ అని పిలిచుకునేవారు.

Also Read : RGV : అప్పటిదాకా నాగార్జునతో మళ్ళీ సినిమా చేయను.. ఆర్జీవీ పంతం.. అయినట్టే ఇక..

ఒకప్పటి స్టార్ హీరో, బాలీవుడ్ ని 50 ఏళ్ళు ఏలిన హీరో మరణించడంతో హిందీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.