Realme GT 7 Pro : రియల్‌మి జీటీ 7ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ. 15,000 తగ్గింపు.. ఇప్పుడే కొనడం బెటర్..!

Realme GT 7 Pro : రియల్‌మి జీటీ 7 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్.. ఏకంగా రూ. 15వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?

1/6Realme GT 7 Pro
Realme GT 7 Pro : కొత్త రియల్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి జీటీ 7 ప్రో ధర భారీగా తగ్గింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ ధర కన్నా రూ. 15వేల వరకు తక్కువ ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు పొందవచ్చు.
2/6Realme GT 7 Pro
ఈ ఫోన్ పవర్‌ఫుల్ కెమెరా, ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. రియల్‌మి జీటీ 8 ప్రో లాంచ్‌కు ముందే రియల్‌మి జీటీ 7 ప్రో ధర తగ్గింపు పొందింది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/6Realme GT 7 Pro
రియల్‌మి జీటీ 7 ప్రో డిస్కౌంట్, ఆఫర్లు : రియల్‌మి జీటీ 7 ప్రో ఫోన్ రూ.59,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. 12GB ర్యామ్+ 256GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.44,498కి లభ్యమవుతుంది. ఈ ఫోన్‌కు బ్యాంక్ ఆఫర్‌లు కూడా వర్తిస్తాయి. మీ పాత ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.33,300 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ రియల్‌మి ఫోన్ చాలా తక్కువ ధరకు పొందవచ్చు.
4/6Realme GT 7 Pro
రియల్‌మి జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్లు : ఈ రియల్‌మి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K LTPO Eco2 OLED ప్లస్ 3D డిస్‌ప్లే కలిగి ఉంది. FHD+ (ఫుల్ హెచ్‌డీ+) రిజల్యూషన్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే రిజల్యూషన్ 2780 x 1264 పిక్సెల్‌, స్క్రీన్-టు-బాడీ రేషియో 94.2 శాతం వరకు ఉంటుంది. డిస్‌ప్లే చాలా సన్నని బెజెల్స్ కలిగి ఉంది. టాప్ బ్రైట్‌నెస్ 6500 నిట్స్ చేరుకుంటుంది.
5/6Realme GT 7 Pro
ఈ రియల్‌మి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌కు 3nm టెక్నాలజీపై క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ రియల్‌మి ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి యూఐ 6.0పై రన్ అవుతుంది. 5,800mAh భారీ బ్యాటరీతో వస్తుంది. స్పీడ్ ఛార్జింగ్ కోసం 120W సూపర్‌ఫాస్ట్ ఛార్జర్ కూడా అందిస్తుంది.
6/6Realme GT 7 Pro
కెమెరా స్పెసిఫికేషన్లు : ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. 50MP మెయిన్ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్)తో వస్తుంది. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 120x సూపర్ జూమ్‌కు సపోర్టు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.