Bihar Assembly Elections : బీహార్‌లో రెండో విడత పోలింగ్.. ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు
Bihar Assembly Elections : బీహార్ రాష్ట్రంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 20జిల్లాల్లోని 122 సీట్లకు పోలింగ్ జరుగుతుంది.
Bihar Assembly Elections
Bihar Assembly Elections : బీహార్ రాష్ట్రంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 20జిల్లాల్లోని 122 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. దాదాపు 3,70,13,556 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం 45, 399 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో 40,073 గ్రామీణ ప్రాంతాల్లో, 5,326 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
రెండో విడత జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 1302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 1,165 మంది పురుషులు, 136మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ పోటీలో ఉన్నారు.
ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది..
చివరి విడత ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో 53నియోజకవర్గాల్లో బీజేపీ, 44చోట్ల జెడియు, 15 చోట్ల ఎల్‌జెపి, హెచ్ ఎ ఎం 6, ఆర్ ఎల్ ఎం 4 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మహఘట్‌బందన్ నుంచి ఆర్జెడి 71, కాంగ్రెస్ 37, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ 8, సిపిఎంఎల్ 6, సిపిఐ4, సిపిఎం 1 చోట పోటీ చేస్తున్నాయి. ఇక జన్ సూరాజ్ పార్టీ 120 స్థానాల్లో పోటీ చేస్తుంది.
మాజీ డిప్యూటీ సీఎం, కతిహార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి తార్కిషోర్ ప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా కుటుంబంతో కలిసి నేను ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చాను. కతిహార్ నియోజకవర్గం, బీహార్‌లోని ఓటర్లకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నా.. బీహార్ వేగంగా పురోగతి సాధించిన విధానం, సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ భావన – మంచి పాలన అందించే ప్రభుత్వానికి ఓటు వేయండి అని ఆయన కోరారు.
#WATCH | #BiharElection2025 | Katihar, Bihar: Former Deputy CM and BJP candidate from Katihar, Tarkishore Prasad casts his vote in the second and final phase of the State Assembly elections. pic.twitter.com/G128cMnNok
— ANI (@ANI) November 11, 2025
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్, అతని భార్య రేణు హుస్సేన్ సుపాల్‌లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#WATCH | #BiharElection2025 | BJP national spokesperson Syed Shahnawaz Hussain and his wife Renu Hussain cast their vote at a polling booth in Supaul. pic.twitter.com/gqHAtgTBJR
— ANI (@ANI) November 11, 2025
స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ (పప్పు యాదవ్’ పూర్నియాలోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
#WATCH | Bihar: Independent MP from Purnea, Pappu Yadav, casts his vote at a polling booth in Purnea#BiharElection2025 pic.twitter.com/C8R03JCHe1
— ANI (@ANI) November 11, 2025
