Dheekshith Shetty : ‘ది గర్ల్ ఫ్రెండ్’ రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది.. అమ్మాయిలంతా అక్కడే ఫ్లాట్ అంట..

తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరో ప్రకటించారు.

Dheekshith Shetty : ‘ది గర్ల్ ఫ్రెండ్’ రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది.. అమ్మాయిలంతా అక్కడే ఫ్లాట్ అంట..

Dheekshith Shetty Playing Boy Friend Role in Rashmika Mandanna The Girl Friend Movie

Updated On : December 22, 2023 / 8:38 PM IST

Dheekshith Shetty : రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘యానిమల్’(Animal) సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టింది. టాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రష్మిక ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girl Friend) అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూట్ కూడా మొదలుపెట్టారు. ప్రేమ, ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరో ప్రకటించారు. ఈ సినిమాలో రష్మికకు బాయ్ ఫ్రెండ్ గా కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. దీక్షిత్ పలు తెలుగు, కన్నడ సినిమాల్లో నటించాడు. కన్నడలో దియా సినిమాతో ఫేమ్ అవ్వగా తెలుగులో దసరా సినిమాతో పాపులర్ అయ్యాడు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి దీక్షిత్ శెట్టిని పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Also Read : Ram Charan : మహారాష్ట్ర సీఎంతో రామ్ చరణ్ దంపతులు.. వైరల్ అవుతున్న ఫొటో..

ఇందులో దీక్షిత్ గురించి రష్మిక వాయిస్ ఓవర్ లో చెప్తూ.. నా బాయ్ ఫ్రెండ్ పేరు విక్కీ.. విక్రమ్. MSC కంప్యూటర్ సైన్స్. బళ్లారి అబ్బాయి. విక్కీనే మా కాలేజీ టీం విరాట్ కోహ్లీ. విక్రమ్ స్మైల్ చేస్తే చాలు అమ్మాయిలంతా అక్కడే ఫ్లాట్ అని చెప్పింది.