Kalinga Movie : మా సినిమాలో అమ్మవారిని చూపించిన విధానం అందరికి నచ్చింది.. ‘కళింగ’ టీమ్..
కళింగ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులని బాగానే భయపెట్టింది.

Dhurv Vaayu Pragya Nayan Kalinga Movie Success Meet
Kalinga Movie : ధృవ వాయు ఇటీవలే కళింగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా నటిస్తూ తనే కళింగ సినిమాకు దర్శకత్వం వహించాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా ప్రగ్య నయన్ హీరోయిన్ గా, ఆడుకాలం నరేన్, సంజయ్ కృష్ణ, లక్ష్మణ్ మీసాల, మురళీధర్ గౌడ్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా వచ్చింది.
కళింగ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులని బాగానే భయపెట్టింది. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో పాటు డివోషనల్ టచ్ కూడా ఇచ్చి ప్రేక్షకులని మెప్పించారు. తాజాగా కళింగ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు.
Also Read : Shekar Basha : నేనే కావాలని అడిగి బయటకు వచ్చేసాను.. శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు..
కళింగ సక్సెస్ మీరు లో హీరో, డైరెక్టర్ ధృవ వాయు మాట్లాడుతూ.. ఇప్పుడు సినిమాలకు ఉన్న పరిస్థితుల్లో నాలాంటి కొత్త వ్యక్తి వచ్చి సినిమా తీయడం, హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. వర్డ్ ఆఫ మౌత్ తో మా సినిమా అందరికీ చేరువ అవుతోంది. మా సినిమాలో విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కంటెంట్ ఉంటే సినిమాను హిట్ చేస్తామని మరోసారి తెలుగు ఆడియెన్స్ చూపించారు. మా సినిమాని ఆదరిస్తున్నందుకు ఆడియెన్స్‌కు ధన్యవాదాలు అని అన్నారు.
నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. కళింగ సినిమా మీద మా డైరెక్టర్ ముందు నుంచి నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకమే ఇప్పుడు విజయం తీసుకొచ్చింది. టెక్నికల్‌గా మూవీ చాలా బాగుందని అందరూ అంటున్నారు అని తెలిపారు. హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ.. సినిమా చూసాక అందరూ నన్ను సినిమాలోని క్యారెక్టర్ పేరు పద్దు అనే పిలుస్తున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడేళ్లుగా ఈ సినిమా కోసం పని చేశాను. ఇవాళ సక్సెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది.