Pisasu 2: దెయ్యంలో సినిమాలో ఆండ్రియా.. నగ్నంగా నటించిందా?

పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు కూడా సిద్దమే అని కొందరు హీరోయిన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. అయితే.. అందరికీ అలాంటి పాత్రలు రావు. వచ్చినా కొందరు అలాంటి సీన్లను సిద్ధంగా ఉండరు. అయితే.. సినిమాకు అలాంటి సీన్ ఖచ్చితంగా అవసరమని భావిస్తే కొందరు ఏ మాత్రం వెనకాడడం లేదు.

Pisasu 2: దెయ్యంలో సినిమాలో ఆండ్రియా.. నగ్నంగా నటించిందా?

Pisasu 2

Updated On : April 30, 2022 / 9:42 PM IST

Pisasu 2: పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు కూడా సిద్దమే అని కొందరు హీరోయిన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. అయితే.. అందరికీ అలాంటి పాత్రలు రావు. వచ్చినా కొందరు అలాంటి సీన్లను సిద్ధంగా ఉండరు. అయితే.. సినిమాకు అలాంటి సీన్ ఖచ్చితంగా అవసరమని భావిస్తే కొందరు ఏ మాత్రం వెనకాడడం లేదు. ఆ మధ్య ‘ఆడై’ సినిమా కోసం అమలాపాల్ నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే కాగా అది తెలుగులో ఆమె పేరుతో డబ్బింగ్ చేయగా ఇక్కడా సక్సెస్ సాధించింది.

Andrea Jeremiah: అదరహో ఆండ్రియా.. నీ అందం అదిరేనమ్మా!

కాగా, ఇప్పుడు ఆండ్రియా జెరెమియా కూడా అలాంటి పాత్ర చేసినట్లు ఇండస్ట్రీ టాక్. మిష్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన 2016లో ‘పిశాసు’ సినిమా తమిళంతో తెలుగులో కూడా పిశాచి పేరుతో మంచి విజయాన్ని అందుకుంది. మూడేళ్ళ క్రితమే ఈ మూవీకి సీక్వల్‌గా‌ ‘పిశాసు-2’ రాబోతోందని మిష్కిన్ ప్రకటించాడు. ఇప్పటికే గత ఏడాది ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలుకాగా కరోనాతో బ్రేక్ పడింది. కరోనా తగ్గిన తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసి తాజాగా టీజర్లు కూడా వదిలారు. అయితే ఈ సినిమాలో ఆండ్రియా నగ్నంగా నటించినట్లు ప్రచారం జరుగుతుంది.

Andrea Jeremiah : బోల్డ్ బ్యూటీ ఆండ్రియా..

కథ డిమాండ్‌ చేయడంతో నగ్నంగా కనిపించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు గత ఏడాదే వార్తలు వినిపించాయి. కాగా ఇప్పుడు టీజర్ విడుదలతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఆండ్రియాతో పాటు పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణిలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలు పెంచగా తాజా టీజర్ మరింత ఆసక్తి పెంచింది. ఇక ట్రైలర్ ఎలా ఉండనుందోనని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.