సంతానం హీరోగా ‘డిక్కీలోనా’ ప్రారంభం
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న ‘డిక్కీలోనా’ మూవీ షూటింగ్ ప్రారంభం..

కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న ‘డిక్కీలోనా’ మూవీ షూటింగ్ ప్రారంభం..
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న ‘డిక్కీలోనా’ సినిమా సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అనఘ, షిరీన్ కంచ్వాలా హీరోయిన్స్. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌లో, కార్తీక్ యోగి దర్శకత్వంలో రూపొందనున్న ‘డిక్కీలోనా’ మూవీలో సంతానం త్రిపాత్రాభినయం చేయనున్నాడు.
అర్జున్, శంకర్‌ల కాంబోలో వచ్చిన ‘జెంటిల్‌మెన్’ సినిమాలో గౌండుమణితో సెంథిల్ ‘డిక్కీలోనా’ ఆట గురించి చెప్పే సీన్ గుర్తుండే ఉంటుంది.. ఇప్పుడు అదే టైటిల్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుంది ‘డిక్కీలోనా’ చిత్రం..
Read Also : లాల్ సింగ్ చద్దా – ఫస్ట్‌లుక్
ఈ సినిమాతో ఫేమస్ ఇండియన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ యాక్టర్‌గా మారుతున్నాడు. ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం మూవీ టీమ్ హర్భజన్ సింగ్‌ను సెలెక్ట్ చేసింది. ‘డిక్కీలోనా’ 2020 ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది.
What a great day to start this fun-tastic project! ?? #DikkiloonaShootFromToday – looking forward to a lot of laughter with @iamsanthanam & Dir @karthikyogitw ?#Dikkiloona @thisisysr @SoldiersFactory @AnaghaOfficial @KanchwalaShirin @sinish_s pic.twitter.com/4BanXm3Axc
— KJR Studios (@kjr_studios) November 18, 2019