Dil Raju and Family Star Movie Team wants to Meet some Families in Telugu States
Dil Raju : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమా ఫ్యామిలీస్ కి మాత్రం బాగానే కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఓ వ్యక్తి ఫ్యామిలీ కోసం ఎలా నిలబడ్డాడు, ఎలా కష్టపడ్డాడు అని చూపిస్తూ ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి చెప్పారు. తాజాగా దిల్ రాజు మూవీ టీంతో కలిసి నేడు సాయంత్రం ఫ్యామిలీ స్టార్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమా చూసి ఫ్యామిలీ ఆడియన్స్ మంచి మెసేజ్ లు ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణలో వాళ్ళ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని రేపట్నుంచి కలవడానికి వెళ్తున్నాము. ఇప్పటికి మూడు కుటుంబాలు ఫైనల్ చేశాము. ఇంకా లిస్ట్ వస్తుంది. లిస్ట్ ఫైనల్ అయ్యాక రేపట్నుంచి నేను, విజయ్, మృణాల్, పరుశురాం కలిసి ట్రావెల్ చేస్తాము. ఎవరైతే కష్టపడి తన ఫ్యామిలీని పైకి తీసుకువచ్చారో, ఎవరైతే తమ ఫ్యామిలీకి ఫ్యామిలీ స్టార్ లా నిలబడ్డారో అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ని కలవడానికి మేమంతా వెళ్తున్నాం. వాళ్ళని కలిసి సర్ ప్రైజ్ చేస్తాము అని తెలిపారు.
Also Read : Bharathanatyam : ‘భరతనాట్యం’ మూవీ రివ్యూ.. క్రైం కామెడీతో వచ్చిన ‘దొరసాని’ డైరెక్టర్..
మరి ఫ్యామిలీ స్టార్ టీంని కలిసే ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలి. దీంతో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, మూవీ టీం రేపట్నుంచి సక్సెస్ టూర్ వేస్తుందని తెలుస్తుంది. విజయ్ అభిమానులు విజయ్ తమ ఊరికి వస్తాడేమో అని ఎదురుచూస్తున్నారు. ఇక దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు అభినందిస్తున్నారు.
We are going to surprise a few real family stars who brought their family to next level. – Says Producer #DilRaju #FamilyStar pic.twitter.com/17I67mOTjK
— Suresh PRO (@SureshPRO_) April 5, 2024