కాంబో కుదిరిందా?

ప్రభాస్, దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా

  • Published By: sekhar ,Published On : January 2, 2019 / 09:23 AM IST
కాంబో కుదిరిందా?

ప్రభాస్, దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్‌లో సాహో సినిమా చేస్తున్నాడు. దానితో పాటు, జిల్ ఫేమ్ రాధాకృష్ణతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ మూవీకి జాన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా తర్వాత నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, డార్లింగ్‌తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకుముందు రాజు బ్యానర్‌లో ప్రభాస్, మున్నా, మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలు చేసాడు. మున్నా, దిల్ రాజు నిర్మాతగా మొట్ట మొదటి సారి నష్టాలు చూసిన సినిమా. మిస్టర్ పర్‌ఫెక్ట్ బాగానే ఆడింది. ఇప్పుడు ప్రభాస్‌తో ముచ్చటగా మూడవ సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నాడు.

ఆ సినిమాకి, రీసెంట్‌గా కె.జి.ఎఫ్‌తో సెన్షేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్‌ని దర్శకుడిగా సెలెక్ట్ చేసారు. దిల్ రాజు ప్రోద్బలంతో, ప్రశాంత్ ఇప్పటికే ప్రభాస్‌ని కలిసి, స్టోరీ‌లైన్ వినిపించాడట. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో, పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తుంది. ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్‌‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సాహో, జాన్ సినిమాల తర్వాత, ప్రభాస్, దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కాంబో సెట్స్‌పైకి వెళ్ళే చాన్స్ ఉంది.