Dil Raju : దిల్ రాజు రెండో భార్య కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు చూశారా..

ఇటీవల దిల్ రాజు రెండో భార్య కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు ఇండస్ట్రీలోని ప్రముఖులు మధ్య ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన వీడియో..

Dil Raju : దిల్ రాజు రెండో భార్య కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు చూశారా..

Dil Raju shares his son ANVAY first birthday celebration video

Updated On : July 5, 2023 / 2:47 PM IST

Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి నిర్మాతగా రెండు నేషనల్ అవార్డ్స్ అందుకొని అగ్ర స్థానాన్ని అందుకున్నాడు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మొదట అనిత అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి హన్షిత రెడ్డి అనే అమ్మాయి కూడా పుట్టింది. హన్షిత కూడా ఇటీవలే ‘బలగం’ సినిమాతో నిర్మాతగా మారింది. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 లో గుండెపోటుతో మరణించారు. ఆ సంఘటనతో దిల్ రాజు చాలా రోజులు బాధ పడ్డారు.

Samantha : సమంతకు మయోసైటిస్ ఇంకా తగ్గలేదా? చికిత్స కోసం అమెరికాకు.. అందుకే సినిమాలకు బ్రేక్?

ఇక దాని నుంచి కోలుకున్న దిల్ రాజుకి.. తేజస్వినితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి 47 వయసులో తేజస్విని ని పెళ్లి చేసుకున్నాడు. 2020 లో వీరిద్దరికి పెళ్లి కాగా, 2022 లో ఒక బాబుకి జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యారు. బాబుకి ‘అన్వయ్’ అనే పేరుని పెట్టారు. ఇటీవల అన్వయ్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్‌కి.. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, సురేష్ బాబు, త్రివిక్రమ్, వక్కంతం వంశీ వంటి ఇండస్ట్రీలోని ప్రముఖులంతా హాజరయ్యి అన్వయ్ ని ఆశ్వీరాదించారు.

Devil : డెవిల్ గ్లింప్స్ రిలీజ్.. నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ బర్త్‌డే గిఫ్ట్..

ఆ బర్త్ డేకి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో సాంగ్ ని దిల్ రాజు రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో దిల్ రాజు మరియు కుటుంబ సభ్యులు.. అన్వయ్ ని ముద్దాడుతూ కనిపిస్తున్నారు. ఈ సాంగ్ కి థమన్ సంగీతం అందించగా కార్తీక్ పాడాడు. మరి ఒకసారి ఆ సాంగ్ ని మీరు కూడా చూసేయండి.