Dil Raju Spoke about Movie Theaters Issue and Gives Clarity
Sil Raju : గత కొన్ని రోజులుగా థియేటర్స్ బంద్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య ఇష్యూ జరుగుతుంది. ఈ ఇష్యూ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అవడంతో టాలీవుడ్ లో చర్చగా మారింది. ఈ ఇష్యూపై నేడు దిల్ రాజు మీటింగ్ పెట్టి అసలు ఈ థియేటర్స్ ఇష్యూ ఎక్కడ మొదలైంది, దేనికోసం అని క్లారిటీ ఇచ్చారు.
దిల్ రాజు ఈ ఇష్యూ గురించి చెప్తూ.. ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు. అప్పుడు ఎగ్జిబిటర్లు పర్శంటేజ్ విధానం అడిగారు. ఈ ఇష్యూ అక్కడ మొదలైంది. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు పర్శంటేజ్ విధానంలోనే నడుస్తున్నాయి. కొన్ని సినిమాలకు కొన్ని చోట్ల మాత్రమే రెంట్ మీద నడుస్తున్నాయి. అక్కడ ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోకపోతే ఇక్కడ నిర్మాతల వరకు వచ్చింది ఈ విషయం.
Also Read : Dil Raju : తెలంగాణలో మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇన్నే.. అందులో నావి 30 మాత్రమే.. మిగిలినవి వాళ్ళవే..
దీనిపై ఏప్రిల్ 26న గిల్డ్ మీటింగ్ జరిగింది. మాకు అప్పుడు బంద్ గురించి చెప్పారు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళను ఆరు నెలల థియేటర్స్ ఆదాయాలు వివరాలు తెమ్మని చెప్పాలని అనుకున్నాం. ఈ మీటింగ్ జరిగేసరికి హరిహర వీరమల్లు డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మామూలుగానే బాగా రెవెన్యూ వస్తే రెంట్, సెకండ్ వీక్ లో పర్శంటేజ్ ఇస్తున్నాం. ఇది కాస్త కష్టమే.
ఈ ఇష్యూ తర్వాత ఈస్ట్ గోదావరి నుంచి నైజాంకు వచ్చింది. ఇక్కడ కూడా శిరీష్ ని ఆ కొన్ని సినిమాలకు కూడా పర్శంటేజ్ ఇమ్మని అడిగారు. వాళ్ళతో మేము 30 ఏళ్లుగా బిజినెస్ చేస్తున్నాం. మే 18న ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. నేను ఆ మీటింగ్ లాస్ట్ లో వెళ్ళాను. అక్కడ పర్శంటేజ్ విధానం అడిగారు. కొంతమంది బంద్ చేస్తాం అని చెప్తే వద్దు అన్నాను. దానికి అందరూ ఓకే అన్నారు. ఆ తరవాత ఎగ్జిబిటర్స్ ఫిలిం ఛాంబర్ కి లెటర్ రాసి సమస్యలు తీర్చకపోతే బంద్ చేస్తామన్నారు. కానీ బంద్ చేసేస్తున్నారు అని బయటకు వచ్చింది.
Also Read : Dil Raju – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గారు తిడితే పడతాం.. తప్పేముంది.. దిల్ రాజు కామెంట్స్..
ఛాంబర్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ బయటకు వచ్చి ఖండించాలి ఎవరూ రాలేదు. వాళ్ళది తప్పు. ఇక్కడ ఎవరి దారి వారిదే. నిన్న అరవింద్, ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టాం. కోవిడ్ లో తప్ప ఎప్పుడూ థియేటర్స్ మూసెయ్యలేదు. సినిమాలు ఉంటే వేసుకుంటే డబ్బులు వస్తాయి, మూసేస్తే వాళ్ళకే నష్టం. డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ లో కూడా బంద్ వద్దు అన్నారు. తర్వాత మే 24 మీటింగ్ పెట్టుకున్నాం. నిర్మాతలు అంతా ఎగ్జిబిటర్స్ సమస్యలు విని ఏం చేయాలి అని ఆలోచించాలి అనుకున్నాం, థియేటర్స్ బంద్ వద్దు అనుకున్నాం. తర్వాత మీటింగ్ మే 30 ఉంది. నిర్మాతలు – ఎగ్జిబిటర్లు – డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఈ మీటింగ్ లో పాల్గొంటారు.
కానీ ఈ లోపే ఈ థియేటర్స్ ఇష్యూ గురించి ఏపీ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్లిందని అనుకుంటున్నాం. అసలు హరిహర వీరమల్లుకి దీనికి సంబంధం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు సపోర్ట్ ఇస్తున్నాయి. అసలు ఈ ఇష్యూ అంతా తెరపైకి తెచ్చింది ఓ ఈస్ట్ గోదావరి వ్యక్తి. అతను అందర్నీ కలిపి ఇలా మాట్లాడించాడు. రీసెంట్ గా అతను ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతనే ఈ థియేటర్స్ ఇష్యూని నైజాంకి కూడా తెచ్చాడు అని అన్నారు.
దీంతో మే 30 న అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని సమస్యలకు ఒక పరిష్కారం తెస్తారని, థియేటర్స్ బంద్ ఉండదు అని తెలుస్తుంది.