Dil Raju: ఆ డైరెక్టర్‌కు దిల్ రాజు ఝలక్..?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసగా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో రెండు భారీ బడ్జెట్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ తనదైన మార్క్ వేసుకుంటున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. గతంలో ‘జెర్సీ’ చిత్రంతో తనలోని ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఓ కథను దిల్ రాజుకు వినిపించగా, ఈ సినిమాను తన బ్యానర్లోనే చేద్దామని ఆ డైరెక్టర్‌కు మాటిచ్చాడట.

Dil Raju: ఆ డైరెక్టర్‌కు దిల్ రాజు ఝలక్..?

Dil Raju To Give Shock To This Director

Updated On : October 29, 2022 / 6:57 PM IST

Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసగా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న RC15 అనే ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ సినిమాను కూడా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో రెండు భారీ బడ్జెట్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ తనదైన మార్క్ వేసుకుంటున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.

Dil Raju : బాహుబలిని కూడా ట్రోల్ చేశారు.. ఇప్పుడు ఆదిపురుష్.. కొంతమంది కావాలని చేస్తున్నారు..

అయితే గతంలో ‘జెర్సీ’ చిత్రంతో తనలోని ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఓ కథను దిల్ రాజుకు వినిపించగా, ఈ సినిమాను తన బ్యానర్లోనే చేద్దామని ఆ డైరెక్టర్‌కు మాటిచ్చాడట. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్‌కు దిల్ రాజు షాకిచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ ముందుగా చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందిగా దిల్ రాజు కోరాడట. దీంతో ఆయన కథలో మార్పులు చేశాడట. అయినా కూడా దిల్ రాజుకు ఈ కథ పూర్తిగా నచ్చలేదని తెలుస్తోంది.

Dil Raju : బింబిసార, సీతారామం ఇండస్ట్రీకి ప్రాణం పోశాయి.. సినిమాకి హీరో, దర్శకుడు, నిర్మాతే ముఖ్యం..

దీంతో గౌతమ్‌కు దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి దిల్ రాజు నిజంగానే జెర్సీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తాడా లేడా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.