Dasaradh : పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చేది రీమేక్ సినిమానే.. కానీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

సంతోషం, సంబరం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు దశరథ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్-హరీష్ శంకర్ సినిమా గురించి మాట్లాడాడు. దశరథ్ మాట్లాడుతూ...........

Dasaradh : పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చేది రీమేక్ సినిమానే.. కానీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

Director Dasaradh gives clarity on Pawan kalyan and Harish Shankar movie

Updated On : January 24, 2023 / 11:05 AM IST

Dasaradh :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతోను, ఇటు సినిమాలతోను బిజీబిజీగా ఉన్నారు. రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహరవీరమల్లు సినిమా షూట్ ఇంకా సాగుతూనే ఉంది. పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల సినిమాలకి టైం ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయంలో మాత్రం పవన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. సినిమాలకి టైం ఇవ్వకపోయినా వరుస సినిమాలు మాత్రం అనౌన్స్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే సినిమా షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాతలు పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే హరీష్ శంకర్ తీసే ఈ సినిమా తమిళ్ లో విజయ్ తీసిన తెరి సినిమాకి రీమేక్ అని మొదట్లో వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసి రీమేక్ మాత్రం వద్దు, ఆ సినిమా అసలే వద్దు అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. హరీహ శంకర్ దీనిపై స్పందించకపోయినా ఇది తెరి సినిమా రీమేక్ అని మాత్రం క్లారిటీ వచ్చేసింది. దీంతో పవన్ ఖాతాలో ఇంకో రీమేక్ సినిమా అని నిరాశపడుతున్నారు పవన్ కళ్యాణ్. కాకపోతే హరీష్ శంకర్ టేకింగ్ మీద నమ్మకం ఉంచారు అభిమానులు.

Netflix : RRR సినిమా మాకు ఉపయోగపడింది.. కానీ.. ఇండియన్ సినిమాలపై నెట్ ఫ్లిక్స్ కామెంట్స్..

ఈ సినిమాకి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రచయితగా పనిచేస్తున్నారు. సంతోషం, సంబరం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలని తెరకెక్కించిన దర్శకుడు దశరథ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్-హరీష్ శంకర్ సినిమా గురించి మాట్లాడాడు. దశరథ్ మాట్లాడుతూ.. హరీష్ శంకర్ తమిళ్ తెరి సినిమాని రీమేక్ చేస్తున్నారు. నేను దానికి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్నాను. ఆ సినిమాని తీసుకొని దాంట్లో చాలా మార్పులు చేశాం. ఈ రీమేక్ కచ్చితంగా పవన్ అభిమానులకి నచ్చుతుంది అని తెలిపారు. దీంతో మరోసారి పవన్-హరీష్ సినిమా రీమేక్ సినిమానే అని క్లారిటీ వచ్చేసింది. మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఈ సినిమా అభిమానులకి ఎంత నచ్చుతుందో చూడాలంటే వెయిట్ చేయక తప్పదు.