Jayashankar : ఈ ప్రయాణంలో వాళ్ళిద్దర్నీ కోల్పోయాను.. ఈ సినిమా వారికే అంకితం.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..

ఈ సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. (Jayashankar)

Jayashankar : ఈ ప్రయాణంలో వాళ్ళిద్దర్నీ కోల్పోయాను.. ఈ సినిమా వారికే అంకితం.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..

Jayashankar

Updated On : October 9, 2025 / 6:19 PM IST

Jayashankar : పేపర్ బాయ్ ఫేమ్ డైరెక్టర్ జయశంకర్ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు అరి అనే సినిమాతో వస్తున్నాడు. ఏడేళ్ల పాటు ఈ సినిమా కోసం దేశంలోని ఆలయాలు, మఠాలు, ఆశ్రమాలు, హిమాలయాలు తిరిగి అరిషడ్వార్గాల మీద రాసుకున్నాడు. ఇప్పటివరకు సినీ పరిశ్రమలో రాని కాన్సెప్ట్‌ మీద కథగా రాసుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.

Also Read : Sai Pallavi : సీత పాత్రకు ఈమెని రిజెక్ట్ చేసి.. సాయి పల్లవిని తీసుకున్నారట.. పాపం రామాయణం మిస్ అయింది..

ఈ సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. జయశంకర్ తన పోస్ట్ లో.. రేపటి నుంచి అరి ఇక ఆడియెన్స్ సొంతం. నాకు ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది.. ఈ ప్రయాణంలో నా జీవితంలోని మూల స్తంభాలైన మా తండ్రి గారు(వంగ కనకయ్య), బావ గారు(కె.వి. రావు) మరణించారు. నేను వారిద్దరినీ కోల్పోయాను. అరి సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌పై వారి ఆశీస్సులు ఉంటాయి. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను అని తెలిపారు.

View this post on Instagram

A post shared by Jayashankarr (@jayashankarr_)