Director Maruthi : డైరెక్టర్ కి కౌంటర్ ఇచ్చిన మారుతి.. నేను చెప్పినా వినలేదు.. చిల్లర పనులు చేయొద్దు.. ఆడియన్స్ ని తిడతారేంటి?

త్రిబాణధారి బార్బరీక్ దర్శకుడు మోహన్ శ్రీవత్సకి మారుతీ డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చాడు. (Director Maruthi)

Director Maruthi

Director Maruthi : ఇటీవల త్రిబాణధారి బార్బరీక్ అనే ఓ సినిమా వచ్చింది. రొటీన్ రివెంజ్ థ్రిల్లర్ సినిమాకు బార్బరీకుడు అనే మహాభారతం పాత్రని లింక్ చేసి ఈ సినిమాని తీశారు. సినిమా కథకు, ఆ పాత్రకు లింక్ ఉండదు. జనాలు మహాభారతం విజువల్స్ ఉంటాయేమో అని థియేటర్ కి వెళ్తే రొటీన్ స్టోరీ ఉండటంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఈ సినిమా టైటిల్ కూడా ఎక్కువగా సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు.(Director Maruthi)

అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స చెప్పుతో కొట్టుకొని మంచి సినిమా తీస్తే చూడరు, మలయాళం సినిమాలు అయితే ఎగబడి చూస్తారు, నేను కూడా కేరళ వెళ్లి అక్కడ సినిమాలు తీస్తాను అని ఆడియన్స్ ని తిట్టాడు. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read : Bakasura Restaurant : ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్న సినిమా.. ఈ తిండిపోతు దయ్యం సినిమా మీరు చూశారా?

తాజాగా బ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా డైరెక్టర్ మారుతీ గెస్ట్ గా వచ్చాడు. త్రిబాణధారి బార్బరీక్, బ్యూటీ సినిమా నిర్మాత ఒక్కరే. మారుతీనే ఈ రెండు సినిమాలను ప్రజెంట్ చేసాడు. దీంతో మారుతీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రిబాణధారి బార్బరీక్ దర్శకుడి పై డైరెక్ట్ గానే కౌంటర్లు వేసాడు.

త్రిబాణధారి బార్బరీక్

డైరెక్టర్ మారుతీ మాట్లాడుతూ.. త్రిబాణధారి బార్బరీక్ మంచి సినిమానే కానీ టైటిల్ ఎవరికీ కనెక్ట్ అవ్వలేదు. నేను టైటిల్ మార్చమని చెప్పాను. డైరెక్టర్ కి వంద టైటిల్స్ పంపించాను. కొన్ని టైటిల్స్ డిజైన్ చేసి కూడా పంపించాను అయినా వినలేదు. ఇంకా నేను ఎక్కువ చెప్పకూడదు నేను కూడా ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ ని ఫోర్స్ చేయొద్దు అని మీ ఇష్టం వెళ్ళండి అయితే అదే టైటిల్ తో అన్నాను. సినిమా పోయింది అని చెప్పుతో కొట్టుకున్నాడు. డైరెక్టర్ అనేవాడు ఒక క్రియేటర్. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు.

Also Read : Raashii Khanna : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్.. పవన్ తో రాశీ ఖన్నా స్పెషల్ సెల్ఫీ వైరల్..

ఆడియన్స్ ని రప్పించడానికి అందరూ చాలా మాట్లాడుతున్నారు. బూతులు మాట్లాడుతున్నారు. చొక్కా తీసేసి తిరుగుతాను అంటున్నారు. సినిమాలు మానేస్తా అంటున్నారు. ఒక సినిమా ఆడకపోతే అందరూ ఇంత దిగజారిపోతారా? ఇంత దారుణంగా మాట్లాడతారా? ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా ఆడుతుంది. అసలు ఇలాంటివన్నీ ఏంటి? కల్చర్ ఎటు వెళ్తుంది? కాంట్రవర్సీ మాట్లాడితే, బూతులు మాట్లాడితే సినిమాలు ఆడతాయి అనుకుంటున్నారు. నేను మొదట్లో డబల్ మీనింగ్ డైలాగ్స్ రాసాను. నేను కూర్చుంటే అలాంటి డైలాగ్స్ ఎవరూ రాయలేరు నాలాగా. కానీ ఇప్పుడు రాయట్లేదు. ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాలతోనే ఆపేసాను ఆ డైలాగ్స్ ఎందుకంటే సినిమాలకు ఫ్యామిలీలు రావాలని.

ఊరికే డైరెక్టర్స్ కి అవకాశాలు ఇచ్చేయరు. ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి సినిమా ఊరికే ఇచ్చేయరు ఇక్కడ. సినిమా ఆడించాలని ఫ్రస్టేషన్ తో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సినిమాని నమ్మండి. జనాలు మంచి సినిమా చేస్తే చూస్తారు. మనం వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాం జనాల నుంచి. మరి అతన్ని మెప్పించాలి కదా. ఆడియన్స్ ని తిడతారేంటి? చెప్పుతో కొట్టుకుంటారా? నాకు చాలా బాధేసింది. ఇలాంటి చిల్లర పనులు, చీప్ పనులు చేయకండి. ఈ సినిమా పోతే ఇంకోటి. నువ్వు చేసిన సినిమా ఆడియన్స్ కి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో రియలైజ్ అయ్యి మంచి సినిమా తీయడానికి ప్రయత్నించాలి కానీ నువ్వు ఏది చేస్తే అది వాళ్ళ మీద రుద్దొద్దు అని డైరెక్ట్ గానే త్రిబాణధారి బార్బరీక్ దర్శకుడికి కౌంటర్లు వేశారు.

Also Read : Mirai OTT Release: బ్లాక్ బస్టర్ మిరాయ్ వచ్చేది ఈ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ ఎప్పటినుండో తెలుసా?