Maruthi: వైష్ణవ్ తేజ్ కోసం మారుతి మార్క్ ఎంటర్టైనర్.. ‘హ్యాపీ పొంగల్’తో హిట్టు కొడతారా?
డైరెక్టర్ మారుతీ(Maruthi) తన నెక్స్ట్ సినిమాను మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ప్లాన్ చేస్తున్నాడు.
Director maruthi doing his next movie with vaishnav tej
- డైరెక్టర్ మారుతీ నెక్స్ట్ సినిమా ఫిక్స్
- వైష్ణవ్ తేజ్ ‘హ్యాపీ పొంగల్’ మూవీ
- త్వరలోనే అధికారిక ప్రకటన
Maruthi: ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో ‘రాజా సాబ్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మారుతీ, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంతకాలంగా వార్తలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘రాజా సాబ్’ ప్రేక్షకులను నిరాశపరచడంతో, ఈ డిజాస్టర్ తర్వాత మారుతీ(Maruthi) మీడియా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు.
Disha patani: మెరిసే సొగసులతో మైమరపిస్తున్న దిశా.. ఈ రేంజ్ గ్లామర్ చూస్తే తట్టుకోగలరా?
అయితే, సుదీర్ఘ విరామం తర్వాత శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియా ద్వారా పలకరించారు. తన అభిమానులకు, ప్రేక్షకులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మారుతీ తన తదుపరి ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘హ్యాపీ పొంగల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఆయన ఒక కొత్త కథను సిద్ధం చేస్తున్నారు.
ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. తన మార్కు వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని మలుస్తున్నాడట మారుతీ. రాజాసాబ్ ఎఫెక్ట్ ను మర్చిపోయేలా వైష్ణవ్ తేజ్‌తో ఒక భారీ సక్సెస్‌ను అందుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఇక వైష్ణవ్ తేజ్ కూడా ఆది కేశవ డిజాస్టర్ తరువాత మరో సినిమా చేయలేదు. కాబట్టి, ఈ ఇద్దరికీ హ్యాపీ పొంగల్ సినిమా ప్రత్యేకంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. మరి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది చూడాలి.
