The Rajasaab: ప్రభాస్ జోకర్ లుక్ అందుకే.. రాజాసాబ్ 2లో కూడా.. నోరుజారిన మారుతీ

ది రాజాసాబ్(The Rajasaab) సినిమాలో ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించడంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు మారుతీ.

The Rajasaab: ప్రభాస్ జోకర్ లుక్ అందుకే.. రాజాసాబ్ 2లో కూడా.. నోరుజారిన మారుతీ

Director Maruthi interesting comments on Prabhas joker look in the Raja Saab movie.

Updated On : January 3, 2026 / 6:47 AM IST
  • రాజసాబ్ లో ప్రభాస్ జోకర్ లుక్
  • రాజసాబ్ 2లో కంటిన్యూ
  • చెప్పగానే ఒప్పేసుకున్న ప్రభాస్

The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. దీంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ది రాజాసాబ్(The Rajasaab) ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు మేకర్స్. చిత్ర యూనిట్ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే దర్శకుడు మారుతీ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే, తనకు తెలియకుండానే ది రాజాసాబ్ మూవీ గురించి పెద్ద అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు మారుతీ. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రాజాసాబ్ మూవీలో ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించిన దాని గురించి అడిగారు.

Hebah Patel: అబ్బా అనిపిస్తున్న హెబ్బా అందాలు.. శారీలో గ్లామర్ ఫోటోలు

ఒక ఐకానిక్ పాత్రను మళ్ళీ చేయడానికి స్టార్స్ ముందుకు రారు. దానికి, ప్రభాస్ ని ఎలా ఒప్పించారు అని అడిగాడు. దానికి మారుతూ మాట్లాడుతూ.. ‘ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించటానికి పెద్ద కథే ఉంది. అది రాజాసాబ్ పార్ట్ 2లో ఉంటుంది. ఆ ఆ లుక్ కి సంబదించిన ప్రాధాన్యతను ప్రభాస్ కి వివరించాను ఆయన ఒప్పుకున్నాడు’అంటూ చెప్పుకొచ్చాడు. ఆలా ఫ్లోలో రాజాసాబ్ పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు మారుతీ.

దీంతో ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం తమ సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్న హీరోలలో టాప్ లో ఉన్నాడు ప్రభాస్. సలార్ 2, కల్కి 2 ఇప్పుడు రాజాసాబ్ 2. మరి ఈ సీక్వెల్స్ ఎప్పుడు అవుతాయో ఎప్పుడు థియేటర్స్ కి వస్తాయి తెలియదు కానీ ఆడియన్స్ కి మాత్రం మంచి కిక్ ఇస్తున్నాయి.