Tribanadhari Barbarik : ఘటోత్కచుడు కుమారుడు బార్బరికుడు మీద సినిమా.. ‘త్రిబాణధారి బార్బరిక్’.. గ్లింప్స్ అదిరిందిగా..

త్రిబాణధారి బార్బరిక్ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..

Tribanadhari Barbarik : ఘటోత్కచుడు కుమారుడు బార్బరికుడు మీద సినిమా.. ‘త్రిబాణధారి బార్బరిక్’.. గ్లింప్స్ అదిరిందిగా..

Director Maruthi Team Product Tribanadhari Barbarik Glimpse Released

Updated On : November 6, 2024 / 5:58 PM IST

Tribanadhari Barbarik : ఇటీవల అందరూ మైథలాజికల్ కాన్సెప్ట్‌ టచ్ చేసి సినిమాలు చేస్తున్నారు. ఈ కోవలోనే ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరికుడు మీద సినిమా రాబోతుంది. ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే అదిరిపోయే టైటిల్‌తో ఈ సినిమా రానుంది.

డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మాణంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో త్రిబాణధారి బార్బరిక్ సినిమా తెరకెక్కింది. తాజాగా నేడు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. గ్లింప్స్ లో బార్బరికుడు గురించి ఎలివేషన్ ఇస్తూ చెప్పడం, బార్బరికుడు కృష్ణుడిని ఆరాధించడం, అలాగే ప్రస్తుత కథకు సంబంధించి చూపించారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయాయి.

Also Read : Shiva Karthikeyan : మా నాన్న ఒక పోలిస్.. డ్యూటీలోనే చనిపోయారు.. శివ కార్తికేయన్ వ్యాఖ్యలు..

ఈ గ్లింప్స్ చూస్తుంటే ప్రస్తుత కథకు, పురాణాలకు లింక్ పెట్టి చూపిస్తున్నట్టు ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. త్రిబాణధారి బార్బరిక్ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..