Shiva Karthikeyan : మా నాన్న ఒక పోలిస్.. డ్యూటీలోనే చనిపోయారు.. శివ కార్తికేయన్ వ్యాఖ్యలు..
తాజాగా అమరన్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

Shiva Karthikeyan Spoke about His Father in Amaran Success Meet
Shiva Karthikeyan : శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన అమరన్ సినిమా ఇటీవల దీపావళికి వచ్చి భారీ విజయం సాధించింది. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్, సాయి పల్లవి ఇద్దరూ తమ నటనతో మెప్పించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. శివ, సాయి పల్లవి ఇద్దరికీ తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా అమరన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు శివ కార్తికేయన్, సాయి పల్లవి, మూవీ యూనిట్ తో పాటు నితిన్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
Also Read : Rana – Samantha : ఈవెంట్లో ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్న రానా, సమంత.. ‘రానా నాయుడు’ని ప్రస్తావిస్తూ..
శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. మేజర్ ముకుంద్ వరదరాజన్ క్యారెక్టర్ చేయడానికి కారణం మా నాన్న. మా నాన్న ఒక పోలీసాఫీసర్. ఆయన కూడా డ్యూటిలోనే చనిపోయారు. ఆయనకు, ముకుంద్ గారికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ సినిమా ఆయనకు ఒక నివాళి లాంటిది అని అన్నారు.
శివకార్తికేయన్ నాన్న దాస్ పోలీసాఫీసర్ గా, జైలు సూపరెండెంట్ గా పని చేసారు. శివకు 17 ఏళ్ళు ఉన్నప్పుడే ఆయన డ్యూటీలో మరణించారు. గతంలో కూడా శివ తన తండ్రి గురించి తలుచుకొని, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.